తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్‌.. భద్రతా ప్రమాణాలపై తనిఖీలు..!

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే కరోనా ఆస్పత్రుల్లో తరుచుగా జరుగుతున్న ప్రమాదాల పట్ల తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్‌ అయింది. అహ్మదాబాద్‌లో ఒక ఆస్పత్రిలో అగ్ని ప్రమాద సంఘటన.. విజయవాడలో కరోనా

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్‌.. భద్రతా ప్రమాణాలపై తనిఖీలు..!
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2020 | 12:07 PM

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే కరోనా ఆస్పత్రుల్లో తరచుగా జరుగుతున్న ప్రమాదాల పట్ల తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్‌ అయింది. అహ్మదాబాద్‌లో ఒక ఆస్పత్రిలో అగ్ని ప్రమాద సంఘటన.. విజయవాడలో కరోనా బాధితులు ఐసోలేషన్‌ చికిత్స పొందుతున్న హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో అన్ని కరోనా ఆస్పత్రుల్లోనూ అగ్నిప్రమాద నివారణ నిబంధనలపై తక్షణమే తనిఖీలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

అగ్ని ప్రమాదాల నివారణకు వైద్య ఆరోగ్యశాఖ పలు సూచనలు జారీ చేసింది. అన్ని ఆస్పత్రులు, హోటళ్లలో అగ్నిప్రమాద నివారణ కోసం జనరేటర్‌ అందుబాటులో ఉంచాలి. అగ్నిప్రమాదం జరిగితే విద్యుత్‌ సౌకర్యాన్ని నిలిపివేసి జనరేటర్‌ను ఆన్‌ చేయాలని పేర్కొంది. హోటల్‌ లేదా ఆస్పత్రి బిల్డింగ్‌పై పెద్ద నీటి తొట్టిని ఏర్పాటు చేయాలి. ప్రతీ ఫ్లోర్‌కు నీటిని అందించేందుకు వీలుగా పెద్ద పైపును ఏర్పాటు చేయాలని తెలిపింది. ఆయా భవనాలకు రెండు వైపులా మెట్లుండాలి. అగ్ని ప్రమాదం జరిగితే రోగులు, ఇతరులు బయటకు రావడానికి వీలుగా ఉండాలని స్పష్టంచేసింది.

గుడ్ న్యూస్: తెలంగాణ ఆస్పత్రుల్లో ఇక ఆర్‌టీ-పీసీఆర్‌ ద్వారా కరోనా టెస్ట్..!

తెలంగాణలో కొలువుల జాతర.. కార్మిక ఉపాధి కల్పన శాఖ కొత్త ప్లాన్‌..!