మె౦తులతో ఆరోగ్య౦

ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారు, పులుసు, పోపులోనూ వాడతాం. మెంతి ఆకులను పప్పుకూరగా, కూరల తయారీలోనూ వాడడం తెలిసిందే. మెంతులలో ఔషధగుణాలనున్నాయని చాలా మందికి తెలుసు. తులను ఆయుర్వేదంలో దీపనీ, మిత్రి అని అంటారు. హిందీలో మెథీ అని పిలుస్తారు. ముదురు పసుపు రంగులో ఉండి, గింజలలోని ఘాటైన సుగంధ […]

మె౦తులతో ఆరోగ్య౦
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:34 PM

ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారు, పులుసు, పోపులోనూ వాడతాం. మెంతి ఆకులను పప్పుకూరగా, కూరల తయారీలోనూ వాడడం తెలిసిందే. మెంతులలో ఔషధగుణాలనున్నాయని చాలా మందికి తెలుసు. తులను ఆయుర్వేదంలో దీపనీ, మిత్రి అని అంటారు. హిందీలో మెథీ అని పిలుస్తారు. ముదురు పసుపు రంగులో ఉండి, గింజలలోని ఘాటైన సుగంధ తైలాలు, ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయి. గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. గింజల్లోని జిగురు, చెడు రుచి కూడా ఈ రసాయనాల వల్లనే. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి.

మెంతులు ఆరోగ్యానికి చాలామంచివి. ఇవి క్యాన్సర్‌ను నివారిస్తాయి. యసిడిటీ, జీర్ణక్రియ సమస్యలను సైతం దూరం చేస్తాయి. మధుమేహ‌ రోగులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. అయితే, వీటిని అతిగా తీసుకోవడం కంటే తగిన మోతాదులో తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. రోగులు ఎదుర్కొనే సమస్యను బట్టి వీటిని తీసుకోవాలి.

దేశంలో నిర్వహించిన వివిధ పరిశోధనల ప్రకారం మెంతుల పొడిని రోజూ తీసుకున్నట్లయితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. శరీరంలోని చెడు కొవ్వులను సైతం తొలగిస్తాయి. మరో సర్వే ప్రకారం మెంతులను వేడి నీళ్లలో నానబెట్టి తాగినట్లయితే టైప్-2 మధుమేహాన్ని నియంత్రించవచ్చు.

మెంతుల్లో ఉండే 4-హైడ్రోక్సీసొలేయూసీనే అనే అమినో యాసిడ్లలో యాంటి-డయాబెటిక్‌లు ఉన్నాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంపొందిస్తాయి. దీనివల్ల రక్తంలోని సుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

ఒక టీ స్పూన్ మెంతి ఆకులు, మెంతులు తీసుకుని ఒక గ్లాసు వేడి నీటిలో వేయండి. పది నిమిషాల పాటు వాటిని అందులో నాననివ్వండి. ఆ తర్వాత కాస్త నిమ్మ రసం, తేనె వేసి కలిపితే చాలు.. మెంతుల టీ సిద్ధమైపోతుంది. అలాగే మెంతులను పెరుగులో వేసుకుని రోజుకు రెండుసార్లు తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

మె౦తులతో లాభాలు

  • బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది
  • బిడ్డపుట్టే ప్రక్రియను సులభ తరం చేస్తుంది
  • మహిళల్లో అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది
  • కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది
  • ఎసిడిక్ రిఫ్లెక్షన్ లేదా హార్ట్ బర్న్ తగ్గిస్తుంది
  • డయాబెటిస్ కంట్రోల్ చేస్తుంది
  • జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
  • జ్వరం మరియు గొంతు సమస్యలను నివారిస్తుంది
  • ఆకలి కంట్రోల్ చేసి బరువు తగ్గిస్తుంది
  • స్కిన్ ఇన్ఫ్లమేషన్ మరియు స్కార్స్ తగ్గిస్తుంది
  • జుట్టు సమస్యలకు ఉత్తమ పరిష్కారం
  • బరువు తగ్గిస్తుంది

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!