హెడ్‌మాస్టర్ దాష్టీకం

పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాల్సిన ఉపాధ్యాయులు సహనం కోల్పోతున్నారు. చిన్నచిన్న కారణాలకే చిన్నారులపై దాష్టీకం ప్రదర్శిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో స్కూల్‌ హెడ్‌ మాస్టర్‌ నిర్వాకం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రైమరీ తరగతి చదువుతున్న విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. అల్లరి చేస్తున్నారనే కారణంతో ఏకంగా చిన్నారులను కాళ్లు, చేతులు కట్టేసి ఓ మూలన పడేసింది స్కూల్‌ హెడ్‌మాస్టర్‌. ఈ ఘటన కదిరి పట్టణంలోని మశానంపేట మున్సిపల్‌ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జరిగింది. కదిరి […]

హెడ్‌మాస్టర్ దాష్టీకం
Follow us

|

Updated on: Nov 28, 2019 | 7:21 PM

పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాల్సిన ఉపాధ్యాయులు సహనం కోల్పోతున్నారు. చిన్నచిన్న కారణాలకే చిన్నారులపై దాష్టీకం ప్రదర్శిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో స్కూల్‌ హెడ్‌ మాస్టర్‌ నిర్వాకం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రైమరీ తరగతి చదువుతున్న విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. అల్లరి చేస్తున్నారనే కారణంతో ఏకంగా చిన్నారులను కాళ్లు, చేతులు కట్టేసి ఓ మూలన పడేసింది స్కూల్‌ హెడ్‌మాస్టర్‌. ఈ ఘటన కదిరి పట్టణంలోని మశానంపేట మున్సిపల్‌ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జరిగింది. కదిరి పట్టణంలో మున్సిపల్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో 3,5వ తరగతి చదువుతున్న పవన్‌, మహమ్మద్‌లు అల్లరి చేసారని తాళ్లతో చేతులు, పాదాలను కట్టేసి పడేసింది. విద్యార్థులు బంధీగా ఉన్న విషయాన్ని కొందరు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పేరేంట్స్‌ తమ పిల్లల పరిస్థితిని చూసి కన్నీరు మున్నీరయ్యారు. వెంటనే కట్లు విప్పదీసి అక్కున చేర్చుకున్నారు. జరిగిన ఘటనపై తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు హెడ్‌మాస్టారును నిలదీశారు. చిన్నారుల పట్ల రాక్షసంగా ప్రవర్తించిన హెడ్‌మాస్టర్‌ శ్రీదేవిని సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు స్కూల్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న కదిరి ఎంఈఓ చిన్ని కృష్ణ హుటాహుటినా పాఠశాలకు చేరుకున్నారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేప్టటారు.
హెడ్‌మాస్టర్‌ పనితీరుపై విద్యాశాఖ అధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం లేకుండా విద్యార్థులను తాళ్లతో కట్టివేసి హింసించడం చాలా దారుణమన్నారు. సమాజం మీద అవగాహన లేని 3,5 వ తరగతి చదువుతున్న చిన్నారులపై దుర్మార్గంగా వ్యవహరించడం ఉపాధ్యాయ వృత్తికి చెడ్డ పేరు వస్తుందని విమర్శించారు. రెండు రోజుల క్రితం పాఠశాలకు సరైన సమయానికి రాలేదని అదే పాఠశాలకు చెందిన ఏడుగురు ఉపాధ్యాయులపై అధికారులు మెమోలు ఇవ్వడం జరిగింది. అది మరువకముందే చిన్నారులను హింసించడం లాంటి ఘటన చోటుచేసుకోవడం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీదేవి వ్యవహార శైలి పై ఉన్నత అధికారులు స్పందించి విచారించి వెంటనే పై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య డిమాండ్ చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తాలూకా ప్రధాన కార్యదర్శి శేషం మహేంద్ర, సహాయ కార్యదర్శులు కోలా బాబు, విజయ్ ,పద్మభూషణ్ నాయక్, తనకల్లు మహేంద్ర, గణేష్, ఉపేంద్ర పాల్గొన్నారు.

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు