తుపాకీతో కాల్చుకుని హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

Head Constable Shot himself with Gun, తుపాకీతో కాల్చుకుని హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

నిజామాబాద్‌ జిల్లాలో హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య కలకలం రేపింది. విధి నిర్వహణలో ఉండగానే కానిస్టేబుల్‌ తన తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లాలోని ఇందల్ వాయి మండల పోలీస్ స్టేషన్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ రెడ్డికి..స్థానిక ఎస్సైకి మధ్య ఓ కేసు విషయంలో వివాదం తలెత్తినట్లుగా సమాచారం. ఆ గొడవతోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని ఈ క్రమంలోనే కానిస్టేబుల్‌ ప్రకాశ్‌రెడ్డి తుపాకీతో కాల్చుకున్నట్లుగా తెలుస్తోంది. మృతుడు ప్రకాశ్‌ రెడ్డి నిజామాబాద్‌ జిల్లా ఎల్లమ్మ గుట్ట నివాసి, ఇతనికి ఇద్దరు పిల్లలు కొడుకు, కూతురు ఉన్నారు. మరో ఎనిమిది నెలల్లో ప్రకాశ్‌రెడ్డి రిటైర్మెంట్‌ కావాల్సి ఉండగా, ఈ ఘటన జరగడంతో స్థానికంగా సంచలనంగా మారింది. విషయం తెలుసుకున్న సీపీ కార్తీకేయ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు సేకరించిన అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు పోలీసు ఉన్నతాధికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *