నాలుగో స్థానంలో… శ్రేయాస్ అయ్యర్!

Head coach Ravi Shastri names India’s No. 4 for upcoming ODIs, నాలుగో స్థానంలో… శ్రేయాస్ అయ్యర్!

గత రెండేళ్ల కాలంలో భారత క్రికెట్‌ జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌కు సంబంధించి ఎక్కువ చర్చకు దారి తీసింది ఏదైనా ఉందంటే అది నాల్గో స్థానం గురించే. భారీ స్కోర్లు సాధించాలన్నా, భారీ టార్గెట్‌లను ఛేదించాలన్నా నాల్గో స్థానం ఎంతో కీలకం. ఈ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆటగాడు నిలకడగా ఆడితేనే మిగతా సభ్యులకు తమ ఆటను స్వేచ్ఛగా ఆడే వీలు దొరుకుతుంది. రెండేళ్లుగా చాలా మంది యువ క్రికెటర్లను నాల్గో స్థానంలో పరిశీలించినా అది నేటికి ప్రశ్నగానే ఉంది. అయితే శ్రేయస్‌ అయ్యర్‌ రాకతో నాల్గో స్థానానికి దాదాపు జవాబు దొరికిందనే అంటున్నాడు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి.

‘ నాల్గో స్థానంపై చాలా కాలంగా కసరత్తు చేస్తూనే ఉన్నాం. ఇక్కడ పలువురు యువ క్రికెటర్లను పరిశీలించినా అది ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మాకు సమాధానం శ్రేయస్‌ అయ్యర్‌ రూపంలో దొరికిందనే అనుకుంటున్నా. ఇక నుంచి వన్డేల్లో అయ్యర్‌ నాల్గో స్థానంలోనే బ్యాటింగ్‌ చేస్తాడు. భారత్‌ ఆడబోయే తదుపరి వన్డే సిరీస్‌ల్లో అయ్యర్‌ నాల్గో స్థానంలోనే బ్యాటింగ్‌కు దిగుతాడు’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

ఇక్కడ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ చూడండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *