మోదీ మంచి ఇంగ్లీషు మాట్లాడతారు… కానీ!

ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో భాగంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మధ్య సమావేశం జరిగింది. సదస్సులో భాగంగా ట్రంప్‌, మోదీ మధ్య జరిగే సమావేశం గురించి పాత్రికేయులు ప్రశ్నించగా..‘ముందు మా మధ్య చర్చలు జరగనివ్వండి. తరవాత మీకు ఆ వివరాలు వెల్లడించగలం’ అని మోదీ హిందీలో సమాధానమిచ్చారు. అప్పుడు ప్రధాని పక్కనే ఉన్న ట్రంప్‌ మధ్యలో కలగజేసుకొని..‘మోదీ అద్భుతమైన ఇంగ్లీషు మాట్లాడగలరు. కానీ ఆయన మాట్లాడటానికి ఇష్టపడరు అంతే’ అని […]

మోదీ మంచి ఇంగ్లీషు మాట్లాడతారు... కానీ!
Follow us

| Edited By:

Updated on: Aug 26, 2019 | 11:10 PM

ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో భాగంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మధ్య సమావేశం జరిగింది. సదస్సులో భాగంగా ట్రంప్‌, మోదీ మధ్య జరిగే సమావేశం గురించి పాత్రికేయులు ప్రశ్నించగా..‘ముందు మా మధ్య చర్చలు జరగనివ్వండి. తరవాత మీకు ఆ వివరాలు వెల్లడించగలం’ అని మోదీ హిందీలో సమాధానమిచ్చారు. అప్పుడు ప్రధాని పక్కనే ఉన్న ట్రంప్‌ మధ్యలో కలగజేసుకొని..‘మోదీ అద్భుతమైన ఇంగ్లీషు మాట్లాడగలరు. కానీ ఆయన మాట్లాడటానికి ఇష్టపడరు అంతే’ అని సరదాగా అన్నారు. దాంతో ఇద్దరు నేతలూ నవ్వుతూ ఒకరి చేతిని మరొకరు పట్టుకున్నారు. ఆ గదిలో ఉన్న మిగిలిన వారు చిరునవ్వులు చిందించారు.

కశ్మీర్‌ అంశం భారత్, పాకిస్థాన్‌ల ద్వైపాక్షిక అంశమని భారత్ ఎన్నోసార్లు స్పష్టం చేసినా, ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ఇప్పటికే ట్రంప్‌ అనేకసార్లు ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశంలో ప్రధాని మరోసారి ఇదే విషయాన్ని ట్రంప్‌కు స్పష్టం చేశారు. దీనిపై ట్రంప్‌ మాట్లాడుతూ..కశ్మీర్‌లో పరిస్థితులు అదుపులో ఉన్నట్లు మోదీ చెప్పారని, రెండు దేశాలు చర్చించుకొని సమస్యను పరిష్కరించుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.