రాజీవ్‌ని అంత మాటంటారా?… రక్తంతో ఈసీకి అమేథీ యువకుని లేఖ

ఎన్నికల సంఘానికి అమేథీ నుంచి లేఖ అందింది. దాన్ని తెరిచి చూస్తే లోపల ఎరుపు రంగు అక్షరాలున్నాయి. ఏంటా అని పరీక్షించి చూడగా అది రక్తంతో రాసిన లేఖ అని తెలిసింది. దీంతో ఎన్నికల సంఘం అధికారులు షాక్ తిన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని..నోటికి వచ్చినట్టు అభ్యంతరకరంగా మాట్లాడితే తమ మనోభావాలు దెబ్బతింటున్నాయన్నది ఆ లేఖలోని సారాంశం. అమేథీలోని షాఘూర్ ప్రాంతానికి చెందిన మనోజ్ కశ్యప్ ఈ లేఖను ఎన్నికల […]

రాజీవ్‌ని అంత మాటంటారా?... రక్తంతో ఈసీకి అమేథీ యువకుని లేఖ
Follow us

|

Updated on: May 08, 2019 | 5:01 PM

ఎన్నికల సంఘానికి అమేథీ నుంచి లేఖ అందింది. దాన్ని తెరిచి చూస్తే లోపల ఎరుపు రంగు అక్షరాలున్నాయి. ఏంటా అని పరీక్షించి చూడగా అది రక్తంతో రాసిన లేఖ అని తెలిసింది. దీంతో ఎన్నికల సంఘం అధికారులు షాక్ తిన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని..నోటికి వచ్చినట్టు అభ్యంతరకరంగా మాట్లాడితే తమ మనోభావాలు దెబ్బతింటున్నాయన్నది ఆ లేఖలోని సారాంశం. అమేథీలోని షాఘూర్ ప్రాంతానికి చెందిన మనోజ్ కశ్యప్ ఈ లేఖను ఎన్నికల సంఘానికి పంపాడు. రాజీవ్ గాంధీని ఉద్దేశించి మోదీ చేసిన వ్యాఖ్యలు తమను తీవ్ర ఆవేదనకు గురి చేసినట్టు  లేఖలో అతను పేర్కొన్నాడు. రాజీవ్ గాంధీ ఈ దేశంలో యువత ఓటు వేసే వయసును 21 నుంచి 18 కి తగ్గించారని..కంప్యూటర్ విప్లవాన్ని, పంచాయితీ రాజ్ వ్యవస్థను తీసుకొచ్చారని గుర్తు చేశాడు. మాజీ ప్రధాని వాజ్‌పేయ్ సైతం రాజీవ్‌ను మొచ్చుకున్నారన్న మనోజ్.. రాజీవ్ గాంధీని ఎవరు అవమానపరిచినా… వాళ్లు ఆయన్ని హత్య చేసిన వారితో సమానం అన్న కోణంలో లేఖ రాశాడు.

రాజీవ్ గాంధీ అమేథీ ప్రజలు, దేశ ప్రజల హృదయాల్లో జీవించి ఉన్నారన్న మనోజ్ కశ్యప్… ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చెయ్యకుండా  మోదీకి ఆదేశాలు ఇవ్వాలని లేఖలో ఈసీని కోరాడు. దీనంతటికీ కారణం ఇటీవల మోదీ… తన ఎన్నికల ప్రచారంలో రాజీవ్ గాంధీని అవినీతి పరుల్లో నంబర్ వన్ అని ఆరోపణలు చేసి కాంగ్రెస్ నేతల ఆగ్రహానికి గురయ్యారు. కాగా  రాజకీయ ప్రయోజనాల కోసం తాను ఈ లేఖను రాయట్లేదని కశ్యప్ తెలిపాడు. ఆ లేఖను కాంగ్రెస్ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.