ఒక్క బీర్ కొని రూ.2 లక్షల టిప్ ఇచ్చాడు.. ఎందుకో తెలియాలంటే..

కొంతమంది చాలా వింతగా ప్రవర్తిస్తారు.. వారు చేసే పనులు కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.. ఎందుకు, ఏమిటని సమాధానం ఉండదు, చేసేస్తారు అంతే. సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి అమెరికాలోని క్లీవ్‌లాండ్ నగరంలో జరిగింది.

  • uppula Raju
  • Publish Date - 11:57 am, Tue, 24 November 20

కొంతమంది చాలా వింతగా ప్రవర్తిస్తారు.. వారు చేసే పనులు కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.. ఎందుకు, ఏమిటని సమాధానం ఉండదు, చేసేస్తారు అంతే. సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి అమెరికాలోని క్లీవ్‌లాండ్ నగరంలో జరిగింది. ఒక వ్యక్తి రెస్టారెంట్‌కి వచ్చి ఒకే ఒక బీర్ కొని ఏకంగా రూ. రెండు లక్షల టిప్ ఇచ్చి వెళ్లిపోయాడు. వినడానికి వింతగా ఉన్న ఇది నిజమే. వివరాల్లోకి వెళితే..

ఆదివారం క్లీవ్‌లాండ్‌లోనినైట్‌టౌన్ రెస్టారెంట్‌కి బీర్ తాగడానికి ఓ వ్యక్తి వచ్చాడు. 7.02 డాలర్లతో (సుమారు రూ.500) ఒక బీర్ కొనుగోలు చేశాడు. ఆ బీర్ తాగాక అక్కడ 3 వేల డాలర్లను ( 2 లక్షల వరకు) టిప్‌గా వదిలేసి వెళ్లాడు. ఈ విషయాన్ని రెస్టారెంట్ యజమాని బ్రెండన్ రింగ్ స్వయంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. మొదటగా ఆ కస్టమర్ డబ్బులు మరిచిపోయి వెళుతున్నాడు కావచ్చని అతడిని వెనక్కి పిలిచినట్లు తెలిపారు. అయితే ఆ వ్యక్తి మొత్తాన్ని టిప్‌గా ఇచ్చినట్లు చెప్పాడని బ్రెండన్ వెల్లడించారు. ఇన్ని డబ్బులను టిప్‌గా ఇచ్చిన ఆ వ్యక్తికి ఆయన థ్యాంక్స్ తెలియజేశారు. కరోనా నేపథ్యంలో ఈ రెస్టారెంట్‌ను కొన్నిరోజులు మూసేస్తున్నట్లు సదరు యజమాని ప్రకటించారు.