స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

వరుస నష్టాల నుంచి దేశీయ మార్కెట్లు కాస్త కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, దేశీయంగా కీలక రంగాల షేర్లలో అమ్మకాలతో ఈ ఉదయం సూచీలు నష్టాలతో ప్రారంభమైనప్పటికీ క్రమంగా కోలుకుని స్వల్ప లాభాలను దక్కించుకున్నాయి. మార్కెట్‌ ఆరంభంలో సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ కూడా 11,800 మార్క్‌ వద్ద ఊగిసలాడింది. అయితే మధ్యాహ్నం సమయానికి సూచీలు కాస్త కోలుకున్నాయి. బ్యాంకింగ్, ఐటీ రంగాల షేర్లలో కొనుగోళ్లు జరగడంతో మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఒక […]

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2019 | 5:45 PM

వరుస నష్టాల నుంచి దేశీయ మార్కెట్లు కాస్త కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, దేశీయంగా కీలక రంగాల షేర్లలో అమ్మకాలతో ఈ ఉదయం సూచీలు నష్టాలతో ప్రారంభమైనప్పటికీ క్రమంగా కోలుకుని స్వల్ప లాభాలను దక్కించుకున్నాయి. మార్కెట్‌ ఆరంభంలో సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ కూడా 11,800 మార్క్‌ వద్ద ఊగిసలాడింది. అయితే మధ్యాహ్నం సమయానికి సూచీలు కాస్త కోలుకున్నాయి. బ్యాంకింగ్, ఐటీ రంగాల షేర్లలో కొనుగోళ్లు జరగడంతో మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 150 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్‌ అయ్యింది. చివరకు 86 పాయింట్ల లాభంతో 39,616 వద్ద ముగిసింది. అటు జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 11,871 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.60గా కొనసాగుతోంది.

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, మహింద్రా అండ్‌ మహింద్రా, టెక్‌ మహింద్రా షేర్లు లాభపడగా.. రెడ్డీస్‌ ల్యాబ్స్‌, యస్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, సిప్లా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు నష్టపోయాయి.