Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

‘సంచాయ్‌ ప్లస్‌’ పేరుతో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ నుంచి అద్భుతమైన పాలసీ

ఇన్సూరెన్స్ పాలసీ కుటుంబానికి రక్షణగా నిలుస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి గట్టేందుకు ఉపయోగపడుతుంది. నమ్ముకున్న వారి కష్టాలను దూరం చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ భీమా పాలసీ తీసుకోవాలి.

ప్రముఖ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌.. ‘సంచాయ్‌ ప్లస్‌’ పేరుతో ఒక పాలసీని మార్కెట్‍లోకి తీసుకువచ్చింది. ఇది ఒక నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్ సేవింగ్స్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఆర్థిక లక్ష్యాలు చేరుకోవడానికి కచ్చితమైన ఆదాయాన్ని అందించే ప్లాన్‌ ఇది. ఇందులో గ్యారంటీ మెచ్యూరిటీ, గ్యారంటీ ఇన్‌కమ్, లైఫ్‌లాంగ్ ఇన్‌కమ్, లాంగ్ టర్మ్ ఇన్‌కమ్ అనే నాలుగు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వివరంగా…

గ్యారంటీ మెచ్యూరిటీ ఆప్షన్‌ : ఇందులో పాలసీ గడువు ముగిసిన తర్వాత మెచ్యూరిటీ మొత్తాన్ని పొందొచ్చు. పాలసీదారుడు చెల్లించిన ప్రీమియం మొత్తానికి ఇది 2.45 రెట్లు ఉంటుంది.

గ్యారంటీ ఇన్‌కమ్‌ ఆప్షన్‌ : ఈ ఆప్షన్ ఎంచుకున్న పాలసీదారులు రెగ్యులర్‌గా ఆదాయం పొందొచ్చు. అదికూడా మెచ్యూరిటీ తర్వాతనే. ఎంత కాలం రెగ్యులర్ ఆదాయం పొందాలనే అంశాన్ని మీరే నిర్ణయించుకోవచ్చు.

లాంగ్‌ టర్మ్‌ ఇన్‌కమ్‌ ఆప్షన్‌ : ఇందులో నిర్దిష్ట కాలపరిమితి పాటు ప్రీమియం చెల్లిస్తూ పోతే మెచ్యూరిటీ అనంతరం 25 నుంచి 30 సంవత్సరాల పాటు క్రమం తప్పని ఆదాయం హామీ ఇస్తుంది. వృద్ధాప్యంలో క్రమం తప్పని ఆదాయాలకు ఇది హామీ ఇస్తుంది.

లైఫ్‌ లాంగ్‌ ఇన్‌కమ్‌ ఆప్షన్‌ : పాలసీ తీసుకునే సమయంలో పాలసీదారుడు ఈ ఆప్షన్ ఎంచుకుంటే తనకు 99 సంవత్సరాలు వచ్చే వరకు క్రమం తప్పకుండా ఆదాయం పొందొచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ సంచయ్ ప్లస్ చీఫ్ శ్రీనివాసన్ పార్థసారథి, మాట్లాడుతూ “ప్రత్యామ్నాయ ఆదాయం కోసం వెతికేవారికి ఇది చాలా అనువైనది అని తెలిపారు. ముఖ్యంగా పదవీ విరమణ వంటి కీలక జీవిత దశలలో ఖచ్చితమైన ఆర్థిక భద్రతను కల్పించడానికి రూపొందించబడింది.” అని వివరించారు.