నిరుద్యోగులకు గుడ్‌న్యూస్…హెచ్‌సీఎల్‌లో భారీగా కొలువుల భర్తీ.!

ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. సుమారు 7000-9000 వరకు ఫ్రెషర్లను అక్టోబర్ 2020 - మార్చి 2021 మధ్య నియమించుకోవాలని సంస్థ భావిస్తోంది...

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్…హెచ్‌సీఎల్‌లో భారీగా కొలువుల భర్తీ.!
Follow us

|

Updated on: Oct 17, 2020 | 3:40 PM

HCL Will Hire 9000 Freshers Soon: ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. సుమారు 7000-9000 వరకు ఫ్రెషర్లను అక్టోబర్ 2020 – మార్చి 2021 మధ్య నియమించుకోవాలని సంస్థ భావిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ సీహెచ్‌ఆర్ఓ వి. అప్పారావు వెల్లడించారు. మొదటి రెండు త్రైమాసికాల్లో 3,000 మందిని తీసుకున్నామని.. అలాగే సెప్టెంబర్ త్రైమాసికంలో 1500 మంది ఫ్రెషర్లను నియమించుకున్నట్లు ఆయన తెలిపారు.

సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో హెచ్‌సీఎల్ సంస్థ భారీ వృద్ధి సాధించి సుమారు రూ. 3,142 కోట్ల లాభాన్ని పొందింది. ఇదే విధంగా ఈ ఆర్ధిక సంవత్సరం ద్వితీయార్ధంలో కూడా బలమైన వృద్ధి నమోదువుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 7-9 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని సంస్థ భావిస్తోంది. అటు సంస్థలోని 1.5 లక్షల మంది ఉద్యోగులకు శాలరీ ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి E3 స్థాయి ఉద్యోగులకు.. జనవరి 1 నుంచి E4, ఆపై స్థాయి ఉద్యోగులకు వేతన ఇంక్రిమెంట్లు అమలు చేయనున్నారు. గతేడాది మాదిరిగానే ఇంక్రిమెంట్స్ ఉంటాయని సంస్థ సీఈఓ సి. విజయ్ కుమార్ వెల్లడించారు.