సానియా సోదరి వివాహం..సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం

టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా సోదరి, హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌ కుమారుడు ఒక్కటవబోతున్నారు. వీరి మ్యారేజ్‌కు గ్రాండ్‌ అరేంజ్‌మెంట్స్‌ చేస్తున్నాయి ఇరు కుటుంబాలు. ఇందులో భాగంగా ఆనమ్‌ మీర్జా, అసదుద్దీన్‌ల వివాహానికి హాజరుకావాలంటూ  సీఎం కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందించారు అజారుద్దీన్‌, సానియామీర్జా. ఇద్దరూ కలిసి ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఈ నెల 12న జరగనున్న వివాహవిందుకు కుటుంబసమేతంగా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఆనమ్‌ మీర్జాకు 2016లో అక్బర్‌ […]

సానియా సోదరి వివాహం..సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం
Follow us

|

Updated on: Dec 10, 2019 | 6:33 PM

టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా సోదరి, హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌ కుమారుడు ఒక్కటవబోతున్నారు. వీరి మ్యారేజ్‌కు గ్రాండ్‌ అరేంజ్‌మెంట్స్‌ చేస్తున్నాయి ఇరు కుటుంబాలు. ఇందులో భాగంగా ఆనమ్‌ మీర్జా, అసదుద్దీన్‌ల వివాహానికి హాజరుకావాలంటూ  సీఎం కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందించారు అజారుద్దీన్‌, సానియామీర్జా. ఇద్దరూ కలిసి ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఈ నెల 12న జరగనున్న వివాహవిందుకు కుటుంబసమేతంగా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.

ఆనమ్‌ మీర్జాకు 2016లో అక్బర్‌ రషీద్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. రెండేళ్ల పాటు సాగిన వారి సంసారంలో మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అసదుద్దీన్‌తో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయం తెలుసుకునున్న ఇరు కుటుంబాలు వారి పెళ్లికి ముహూర్తాలు పెట్టారు. ఇక ఆనమ్‌ మీర్జా ఫ్యాషన్‌ డిజైనర్‌ కాగా..అసదుద్దీన్‌ క్రికెట్‌ కెరీరే ఎంచుకున్నాడు. గతేడాది గోవాలో జరిగిన రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు అసదుద్దీన్‌.