ఇంకా ఎంతమందికి ఎయిడ్స్ ఉందో: హైకోర్టు ఆగ్రహం

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 27 మంది ఖైదీలకు ఎయిడ్స్ ఉందో లేదో నిర్థారించాలని జైలు అధికారులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఖైదీలకు వైద్య పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా ఎంత మందికి ఎయిడ్స్ ఉందో తేల్చాలని జైలు అధికారులను ఆదేశించింది. హైచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుడైన శ్రీనివాసరావు అనే ఖైదీ తనకు బెయిల్ ఇస్తే ఇంటి వద్ద వైద్యం చేయించుకున్నట్లు.. అప్పడు ఈ వ్యాధి బయటపడినట్లు హైకోర్టుకు విన్నవించటంతో అసలు కథ బయటపడింది. పూర్తి […]

ఇంకా ఎంతమందికి ఎయిడ్స్ ఉందో: హైకోర్టు ఆగ్రహం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 02, 2019 | 8:05 PM

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 27 మంది ఖైదీలకు ఎయిడ్స్ ఉందో లేదో నిర్థారించాలని జైలు అధికారులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఖైదీలకు వైద్య పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా ఎంత మందికి ఎయిడ్స్ ఉందో తేల్చాలని జైలు అధికారులను ఆదేశించింది. హైచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుడైన శ్రీనివాసరావు అనే ఖైదీ తనకు బెయిల్ ఇస్తే ఇంటి వద్ద వైద్యం చేయించుకున్నట్లు.. అప్పడు ఈ వ్యాధి బయటపడినట్లు హైకోర్టుకు విన్నవించటంతో అసలు కథ బయటపడింది. పూర్తి వివరాలతో కోర్టుకు నివేదిక అందించాలని ధర్మాసనం జైలు అధికారులను ఆదేశించింది.

ఈ సందర్భంగా .. రాజమండ్రి జైలు డిప్యూటీ సూపరిండెంటెండ్ రాజారావు మాట్లాడుతూ.. హెచ్‌ఐవీతో ఉన్న 19 మంది ఖైదీలు బయట నుంచి వచ్చారని అన్నారు. అనారోగ్యంతో బాధపడే వారికి రక్తపరీక్షలు నిర్వహించనప్పుడు హెచ్‌ఐవీ ఉందని తేలిందని కోర్టుకు వివరించారు.