ఇన్‌స్టాలో కొత్త ఫీచర్ చూశారా..? హోమ్‌ క్వారంటైన్‌…

ప్రపంచాన్ని కరోనా వణికిస్తోన్న ఏ రకంగా వ‌ణికిస్తుందో ప్ర‌త్యేక్యంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ స‌మ‌యంలో ఇంట్లోనే ఉంటోన్న యూజ‌ర్స్ కోసం సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు కూడా అవసరమైన ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌ను అటాచ్ చేసింది. వ‌ర‌ల్డ్ లో చాలా దేశాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. ప్ర‌జ‌లు సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తున్నారు. కానీ కొందరికి దీని గురించి ఎంత చెప్పినా బుర్ర‌కెక్క‌డం లేదు. అందుకే ఇన్‌ స్టాగ్రామ్‌ కూడా తమ యూజర్ల కోసం […]

ఇన్‌స్టాలో కొత్త ఫీచర్ చూశారా..?  హోమ్‌ క్వారంటైన్‌...
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 25, 2020 | 8:11 PM

ప్రపంచాన్ని కరోనా వణికిస్తోన్న ఏ రకంగా వ‌ణికిస్తుందో ప్ర‌త్యేక్యంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ స‌మ‌యంలో ఇంట్లోనే ఉంటోన్న యూజ‌ర్స్ కోసం సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు కూడా అవసరమైన ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌ను అటాచ్ చేసింది. వ‌ర‌ల్డ్ లో చాలా దేశాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. ప్ర‌జ‌లు సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తున్నారు. కానీ కొందరికి దీని గురించి ఎంత చెప్పినా బుర్ర‌కెక్క‌డం లేదు. అందుకే ఇన్‌ స్టాగ్రామ్‌ కూడా తమ యూజర్ల కోసం సామాజిక దూరం బాధ్య‌త‌ను తెలియ‌జెప్పేందుకు కొత్త ఫీచ‌ర్ ను అందుబాటులోకి తెచ్చింది. అదే ‘కో వాచింగ్’ ఫీచర్‌.

హోమ్‌ క్వారెంటైన్‌లో ఉన్న వినియోగ‌దారులు తమ బంధుమిత్రుల‌తో కమ్యూనికేషన్‌లో ఉండేందుకు ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఇన్‌ స్టాగ్రామ్‌ యూజర్స్… పోస్టులను స్క్రోల్‌ చేస్తూనే రిమోట్‌ మోడ్‌లో వీడియోలను సైతం చూడ‌వ‌చ్చు. ఇన్‌ స్టాగ్రామ్ ఖాతాలోని డైరెక్ట్‌ మెసేజ్‌ గ్రూపు చాట్‌ లోని పైన లెఫ్ట్ ఎడ్జ్ లో ఉన్న వీడియో ఐకాన్ క్లిక్ చెయ్యాలి లేదా కొత్త చాట్ క్రియేట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ న‌యా ఫీచర్ తో ఇన్‌ స్టాగ్రామ్‌ స్టోరీ ఫిల్టర్లను కూడా వినియోగించుకునే వెసుల‌బాటు ఉంది. ఇన్‌ స్టాగ్రామ్‌లో యూజర్స్ ఒక‌వైపు స్క్రోల్‌ చేస్తూ తమ స్నేహితుల పోస్టులు, స్టోరీలు లేదా ఇన్‌ స్టాగ్రామ్‌ లైవ్‌ లను ఒకేసారి చూడ‌వ‌చ్చు. ఇక‌ ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్లో కో-వాచ్‌ ఫీచర్‌ తోపాటు ‘స్టే ఎట్‌ హోమ్‌’ స్టిక్కర్‌ ద్వారా ఈ స్టోరీలను పోస్టు చేయవచ్చు. మీ ఫాలోవర్స్, ప్రెండ్స్ కరోనా నుంచి సురక్షితంగా ఉండేలా చూడొచ్చు.