హత్రాస్‌ బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు, ఇల్లు, ఉద్యోగంః యోగి

హత్రాస్‌ బాధితురాలి కుటుంబానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. రూ. 25 లక్షలతో పాటు ఒక ఇళ్లు, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ప్రకటించారు.

హత్రాస్‌ బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు, ఇల్లు, ఉద్యోగంః యోగి
Follow us

|

Updated on: Sep 30, 2020 | 8:27 PM

హత్రాస్‌ బాధితురాలి కుటుంబానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. రూ. 25 లక్షలతో పాటు ఒక ఇళ్లు, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ప్రకటించారు. అంతే కాకుండా, కేసును వెంటనే ఫాస్ట్‌ట్రాక్ కోర్టకు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దర్యాప్తుకు సంబంధించిన రిపోర్టును వారంలోగా ప్రభుత్వానికి అందించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి భగవాన్ స్వరూప్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం పని చేయనుంది. యూపీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ చంద్ర ప్రకాష్ తోపాటు ఆగ్రాలోని పోలీసు ఆర్మ్‌డ్ కనిస్టాబులరీ కమాండ్ పూనమ్ సిట్ లో మిగతా సభ్యులుగా ఉన్నారు. వీరు ముగ్గురూ కలిసి హత్రాస్ కేసును దర్యాప్తు చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచన మేరకు త్వరితగతిన చర్యలు తీసుకున్నట్లు సీఎం యోగి పేర్కొన్నారు.