ట్రంప్ ‘ఛానెల్’ కి దెబ్బ ! ద్వేష పూరిత వ్యాఖ్యలకు బ్రేక్ !

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసే ద్వేష పూరిత వ్యాఖ్యలకు కాలం చెల్లుతోంది. హేట్ ఫుల్ పోస్టులను నిలిపివేసే క్రమంలో భాగంగా తామీ చర్య తీసుకుంటున్నట్టు అమెజాన్ ఆధ్వర్యంలోని 'ట్విచ్' ప్రకటించింది. తమ సంస్థ నిబంధనలను..

ట్రంప్ 'ఛానెల్' కి దెబ్బ ! ద్వేష పూరిత వ్యాఖ్యలకు బ్రేక్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 30, 2020 | 11:03 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసే ద్వేష పూరిత వ్యాఖ్యలకు కాలం చెల్లుతోంది. హేట్ ఫుల్ పోస్టులను నిలిపివేసే క్రమంలో భాగంగా తామీ చర్య తీసుకుంటున్నట్టు అమెజాన్ ఆధ్వర్యంలోని ‘ట్విచ్’ ప్రకటించింది. తమ సంస్థ నిబంధనలను కఠినతరం చేస్తున్నామని, ఇక రెచ్చగొట్టే, హింసను ప్రేరేపించే వ్యాఖ్యలకు తావుండబోదని ట్విచ్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. రాజకీయమైన. లేదా ‘చదవదగిన’ కంటెంట్ల విషయంలో కూడా మినహాయింపులు ఉండబోవన్నారు. అమెరికాలో ప్రవేశిస్తున్న మెక్సికన్లను ట్రంప్ రేపిస్టులు, నేరగాళ్లు, డ్రగ్గిస్టులు అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. శాన్ ఫ్రాన్సిస్కో లోని తుల్యా ర్యాలీలో ఆయన ఇటీవల చేసిన ఓ అసభ్యపు కామెంటును కూడా తొలగించారు. ట్రంప్ కు అనుకూలమైన ఫోరమ్.. హింసను రెచ్ఛగొట్టేలా చేసే వ్యాఖ్యలను రెడిట్ నిషేదించనుంది. ఇంకా ఇలాగే పలు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అమెరికాలో నల్ల జాతీయుల పట్ల ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను, పోలీసుల అమానుషాన్ని ఖండిస్తూ ఇప్పటికే పలు ఫోరాలు పరోక్షంగా ఖండిస్తున్నాయి. అటు కోకకోలా వంటి సంస్థలు కూడా సోషల్ మీడియాలో ద్వేష పూరిత కంటెంట్ తో కూడిన యాడ్ లను ప్రచురించబోమని ప్రకటించిన సంగతి తెలిసిందే.