Breaking News
  • అమరావతి: భూముల కొనుగోలుపై సీఐడీ కేసు నమోదు. ల్యాండ్‌ పూలింగ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సీఐడీ. 796 తెల్ల రేషన్‌కార్డు దారులపై కేసు నమోదు. రూ.3 కోట్లకు ఎకరం భూమి కొనుగోలు చేసిన తెల్ల రేషన్‌కార్డు దారులు. రూ.300 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్టు గుర్తించిన సీఐడీ. విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసిన సీఐడీ. మొత్తం 129 ఎకరాలు కొన్న 131 మంది తెల్ల రేషన్‌కార్డుదారులు. పెద్దకాకానిలో 40 ఎకరాలు కొన్న 43 మంది. తాడికొండలో 180 ఎకరాలు కొనుగోలు చేసిన 188 మంది. తుళ్లూరులో 243 ఎకరాలు కొన్న 238 మంది. మంగళగిరిలో 133 ఎకరాలు కొనుగోలుచేసిన 148 మంది. తాడేపల్లిలో 24 ఎకరాలు కొన్న 49 మంది తెల్ల రేషన్‌కార్డు దారులు.
  • కడప: మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై అమరావతి జేఏసీ నేతల ఆగ్రహం. అమరావతి రాజధానిగా కొనసాగించే వరకు ఉద్యమాలు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం హర్షణీయం. మండలి చైర్మన్‌ పట్ల మంత్రుల తీరు బాధాకరం. ప్రజలే బుద్ధి చెబుతారు-జేఏసీ నేతలు రమణ, శ్రీనివాసులురెడ్డి.
  • నాపై ఆరోపణలు అవాస్తవం-ప్రత్తిపాటి పుల్లారావు. నాపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులపై న్యాయ పోరాటం చేస్తా. రాజధాని భూముల్లో అక్రమాలు జరిగితే కేసులు పెట్టండి. తప్పు చేయకుండా కేసులు పెట్టడం అన్యాయం-ప్రత్తిపాటి.
  • అమరావతి: మంగళగిరి టీడీపీ ఆఫీస్‌కు భారీగా రాజధాని రైతులు. చంద్రబాబు, లోకేష్‌ను అభినందించిన రైతులు, కార్యకర్తలు. లోకేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలు, కార్యకర్తలు. రైతులకు మద్దతుగా జన్మదిన వేడుకలకు దూరంగా లోకేష్‌.
  • ప.గో: పాలకొల్లులో మండలి చైర్మన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జేఏసీ నేతలు, చైర్మన్‌కు బొకేలు ఇచ్చిన అభినందనలు తెలిపిన జేఏసీ నేతలు.

ప్రారంభమైన ‘పింక్’ రీమేక్.. కానీ పవన్ ఎక్కడ..?

Pink remake started, ప్రారంభమైన ‘పింక్’ రీమేక్.. కానీ పవన్ ఎక్కడ..?

అమితాబ్ బచ్చన్ హీరోగా హిందీలో ఘన విజయం సాధించిన పింక్‌ను తెలుగులో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో కలిసి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇవాళ దిల్ రాజు ఆఫీసులో జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో మూవీ యూనిట్‌కు సంబంధించిన పలువురు పాల్గొన్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇటు దిల్ రాజు గానీ, అటు బోనీ కపూర్‌ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అయితే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో ఈ మూవీ రీమేక్‌ను తెరకెక్కింబోతున్నట్లు ఆ మధ్యన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఓ మై ఫ్రెండ్, ఎమ్‌సీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించబోతున్నారని నిర్మాతలు వెల్లడించారు. దీంతో పవన్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ మూవీ ద్వారా తమ అభిమాన నటుడు రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని వారు భావించారు.

కానీ దీనిపై పవన్ మరోలా స్పందించారు. తన అనుమతి లేకుండా సినిమాను ప్రకటించారని, తాను సినిమాల్లో నటించకపోవచ్చని.. కానీ నిర్మాతగా మూవీలు చేస్తానని ఆయన వెల్లడించారు. దీంతో అభిమానుల్లో మళ్లీ డైలామా నెలకొంది. అసలు పవన్ ఈ రీమేక్‌లో నటిస్తాడా..? లేదా..? అన్నది ఇప్పటికీ సస్పెన్స్‌లాగే మారింది. అయితే ఇలాంటి నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా సినిమాను ప్రారంభించడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కాగా ఓవైపు ఏపీలో పవన్ రైతు సౌభాగ్య దీక్ష చేస్తుండగా.. మరోవైపు ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరగడం గమనర్హం. దీంతో అసలు ఈ సినిమాలో పవన్ నటిస్తాడా..? లేదా..? అన్నది మరోసారి సస్పెన్స్‌గా మారింది.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో నివేథా థామస్ కీలక పాత్రలో కనిపించనుందట. అలాగే సమంత కూడా మరో పాత్రలో కనిపించబోతున్నట్లు ఫిలింనగర్ టాక్. మరి అసలు పింక్ రీమేక్‌లో ఎవరు నటించబోతున్నారు..? ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లనుంది..? ఈ మూవీ ద్వారా పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్లేనా..? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానాలు వస్తాయేమో చూడాలి.

కాగా గతంలోనూ ఓ సారి పవన్ కల్యాణ్ సినిమాలో నటించే అవకాశం నివేథాకు వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో అప్పట్లో అనుకున్న ఓ సినిమాలో(వేదాలం రీమేక్ అని టాక్ నడిచింది) పవన్ సోదరిగా నివేథాకు ఆఫర్ వచ్చింది. కానీ అప్పుడప్పుడే నివేథా హీరోయిన్‌గా నిలదొక్కుకుంటుండగా.. ఇలాంటి పాత్రలు చేస్తే కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడదని భావించి ఆ ఆఫర్‌కు నో చెప్పింది. ఈ విషయాన్ని నివేథానే ఓ సందర్భంలో వెల్లడించిన విషయం తెలిసిందే.