ఒక డ్రైవర్‌‌‌‌ కుటుంబంలో పుట్టి.. టీమిండియా స్థాయికి ఎదిగి..

ఇప్పటి వరకూ అతనెవరో తెలియదు. ఆ కుర్రాడికి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి.. మెరుపు వేగంతో బంతులు విసరడం అంటే అతడికి చాలా ఇష్టం. ఏకంగా టెన్నీస్ బాల్‌తోనే బౌలింగ్ చేస్తాడు. ఎప్పుడూ మ్యాచ్ కు రెండు వందల రూపాయలిచ్చే లోకల్ టోర్నీల్లో ఆడటం, విక్కెట్లు తీయడమే అతనికి తెలుసు. కాని సంవత్సరం తిరిగే లోపు రంజీ జట్టులోకి అడుగుపెట్టాడు. చూస్తుండగానే తన పేరు దేశమంతా మారుమోగింది. ఐపీఎల్ కాంట్రాక్ట్ పక్కన పెడితే.. ఇప్పుడు ఏకంగా […]

ఒక డ్రైవర్‌‌‌‌ కుటుంబంలో పుట్టి.. టీమిండియా స్థాయికి ఎదిగి..
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2019 | 1:50 PM

ఇప్పటి వరకూ అతనెవరో తెలియదు. ఆ కుర్రాడికి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి.. మెరుపు వేగంతో బంతులు విసరడం అంటే అతడికి చాలా ఇష్టం. ఏకంగా టెన్నీస్ బాల్‌తోనే బౌలింగ్ చేస్తాడు. ఎప్పుడూ మ్యాచ్ కు రెండు వందల రూపాయలిచ్చే లోకల్ టోర్నీల్లో ఆడటం, విక్కెట్లు తీయడమే అతనికి తెలుసు. కాని సంవత్సరం తిరిగే లోపు రంజీ జట్టులోకి అడుగుపెట్టాడు. చూస్తుండగానే తన పేరు దేశమంతా మారుమోగింది. ఐపీఎల్ కాంట్రాక్ట్ పక్కన పెడితే.. ఇప్పుడు ఏకంగా టీమిండియాలో ఆడే అవకాశం దక్కింది. అతడే వెస్టిండీస్‌‌‌‌ టూర్‌‌‌‌లో పాల్గొనే ఇండియా టీమ్‌‌‌‌కు సెలెక్ట్‌‌‌‌ అయిన యువ పేసర్‌‌‌‌ నవదీప్‌‌‌‌ సైనీ. హర్యానాలో ఒక డ్రైవర్‌‌‌‌ కుటుంబంలో పుట్టి.. స్వయం ప్రతిభతో నేషనల్‌‌‌‌ టీమ్‌‌‌‌కు ఆడే స్థాయికి ఎదిగాడు.

ఈ సీజన్ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 71 రన్స్ కే కుప్పకూలింది. అయితే చిన్న మ్యాచే కదా చెన్నై ఊదేస్తుంది అనుకున్నారు అంతా. కాని, ఛేజింగ్‌కు వచ్చిన చెన్నై ఓపెనర్ వాట్సన్‌కు నవదీప్ సైనీ చుక్కలు చూపించాడు. అయితే అప్పటి వరకు తన సత్తా గురించి క్రికెట్ వర్గాలకు తెలిసినా.. అతను ఆ రేంజ్‌లో బౌలింగ్ చేస్తాడని అందరికి తెలిసింది ఆ మ్యాచ్‌తోనే.