హర్యానాలో పట్టపగలు యువతి కాల్చివేత

హర్యానా,ఫరీదాబాద్ లోని బల్లభ్ ఘడ్ ప్రాంతంలో పట్టపగలు ఓ యువతిని యువకుడొకడు కాల్చి చంపాడు. కామర్స్ స్టూడెంట్ అయిన ఈ యువతి పరీక్ష రాసేందుకు కళాశాలకు వెళ్తుండగా అతడు కారులో వచ్చి అడ్డగించాడని,

  • Umakanth Rao
  • Publish Date - 2:42 pm, Tue, 27 October 20

హర్యానా,ఫరీదాబాద్ లోని బల్లభ్ ఘడ్ ప్రాంతంలో పట్టపగలు ఓ యువతిని యువకుడొకడు కాల్చి చంపాడు. కామర్స్ స్టూడెంట్ అయిన ఈ యువతి పరీక్ష రాసేందుకు కళాశాలకు వెళ్తుండగా అతడు కారులో వచ్చి అడ్డగించాడని, ఆమెను కారులోకి లాగేందుకు యత్నించగా ఆమె ప్రతిఘటించడంతో కాల్పులు జరిపాడని తెలిసింది. తీవ్ర గాయాలకు గురై ఆమె మరణించింది. ఆమెను నిఖితగా గుర్తించారు. కాగా తౌసీఫ్ అనే యువకుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని, తన కుమార్తెను గతంలో ఎన్నోసార్లు వేధించాడని నిఖిత తండ్రి తెలిపారు. తౌసీఫ్ అతని స్నేహితుడు రెహాన్ తన కుమార్తెపై కాల్పులు జరిపి కారులో పరారయ్యారని ఆయన చెప్పారు. తౌసీఫ్ ని పోలీసులు అరెస్టు చేశారు. తౌసీఫ్ గురించి నిఖితకు తెలుసునని, ఆమెతో మాట్లాడడానికి అతడు యత్నించినప్పటికీ ఆమె వినకపోవడంతో పిస్టల్ తో కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.