హర్యానా స్పీకర్ గుప్తా, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా

దేశంలో కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. కొవిడ్ రాకాసి ధాటికి గురవుతున్న ప్రముఖుల జాబితా క్రమంగా పెరుగుతూనే ఉంది. తాజాగా హర్యానా అసెంబ్లీ స్పీకర్ జియాన్ చంద్ గుప్తాతో పాటు మరో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు.

హర్యానా స్పీకర్ గుప్తా, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
Follow us

|

Updated on: Aug 24, 2020 | 5:05 PM

దేశంలో కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. కొవిడ్ రాకాసి ధాటికి గురవుతున్న ప్రముఖుల జాబితా క్రమంగా పెరుగుతూనే ఉంది. తాజాగా హర్యానా అసెంబ్లీ స్పీకర్ జియాన్ చంద్ గుప్తాతో పాటు మరో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి సరిగ్గా రెండు రోజులు ముందు వీరికి కరోనా వైరస్ సోకినట్లు హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ తెలిపారు. అలాగే, ఆరుగురు అసెంబ్లీ సిబ్బంది కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు అధికారులు తెలిపారు. అసెంబ్లీ స్పీకర్‌తోపాటు ఎమ్మెల్యేలు అసీం గోయెల్, రామ్‌కుమార్‌లకు నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయిందని అనిల్ విజ్ తెలిపారు. గుప్తాకు కరోనా సోకడంతో ఆయన స్థానంలో డిప్యూటీ స్పీకర్ రణ్‌బీర్ గాంగ్వా శాసనసభ సమావేశాలను నిర్వహిస్తారని పేర్కొన్నారు.

అయితే, తాను ఆదివారం కరోనా పరీక్ష చేయించుకోగా కరోనా వైరస్ సోకినట్టు తాజాగా రిపోర్టులు వచ్చాయని ఈ ఉదయం గుప్తా ట్వీట్ చేశారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన అందరూ ఐసోలేషన్‌లోకి వెళ్లాలని స్పీకర్ సూచించారు. కరోనాతో భయపడాల్సింది లేదన్న గుప్తా జాగ్రత్తలు పాటిస్తే త్వరగా నయమవుతుందన్నారు.