హర్యానాలో భారీగా పట్టుబడ్డ నిషేధిత మత్తుపదార్ధాలు

హర్యానాలో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. పోలీసులు పలుచోట్ల జరిపిన తనిఖీల్లో పప్పీ హస్క్‌, మరిజునా మత్తుపదార్ధాలు పట్టుబడ్డాయి. జింద్‌, పల్వాల్‌ జిల్లాల్లో మత్తుపదార్ధాల సరఫరా జరుగుతుందన్న సమాచారం..

హర్యానాలో భారీగా పట్టుబడ్డ నిషేధిత మత్తుపదార్ధాలు
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2020 | 7:10 AM

హర్యానాలో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. పోలీసులు పలుచోట్ల జరిపిన తనిఖీల్లో పప్పీ హస్క్‌, మరిజునా మత్తుపదార్ధాలు పట్టుబడ్డాయి. జింద్‌, పల్వాల్‌ జిల్లాల్లో మత్తుపదార్ధాల సరఫరా జరుగుతుందన్న సమాచారం అందడంతో.. పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ చోట 500 కిలోల పప్పీ హస్క్‌ను గుర్తించారు. ఇక మరోచోట 64.75 కిలోలల మరిజునాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్‌ సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేశారు. దీని వెనుక ఉన్న ముఠా గురించి దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

Read More :

కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములుకు కరోనా

మహారాష్ట్రలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

తమిళనాడులో 3 లక్షలకు చేరువలో పాజిటివ్‌ కేసులు