లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా చట్టం.. ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించిన హర్యానా ప్రభుత్వం..

దేశ వ్యాప్తంగా లవ్ జీహాద్ అంశం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. లవ్ జీహాద్‌పై బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒక విధంగా యుద్ధాన్నే ప్రకటించినట్లు కనిపిస్తోంది. లవ్ జీహాద్‌ను అడ్డుకునేందుకు ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టగా..

లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా చట్టం.. ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించిన హర్యానా ప్రభుత్వం..
Follow us

|

Updated on: Nov 26, 2020 | 1:20 PM

దేశ వ్యాప్తంగా లవ్ జీహాద్ అంశం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. లవ్ జీహాద్‌పై బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒక విధంగా యుద్ధాన్నే ప్రకటించినట్లు కనిపిస్తోంది. లవ్ జీహాద్‌ను అడ్డుకునేందుకు ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టగా.. ఆ వరుసలోకే మరో రాష్ట్రం వచ్చి చేరింది. లవ్ జీహాద్‌ను అడ్డుకునేందుకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కమిటీనే నియమించింది.

లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకువస్తామని హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ చట్టాన్ని రూపొందించడం కోసం ప్రత్యేకంగా ముగ్గురు సభ్యులతో కూడిన ముసాయిదా కమిటీని నియమించినట్లు అనిల్ విజ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ కమిటీ లవ్ జీహాద్‌ను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై, నియమ నిబంధనలపై అధ్యయనం చేసి చట్టాన్ని రూపొందిస్తుందని అనిల్ విజ్ తెలిపారు. అదేవిధంగా లవ్ జీహాద్‌పై ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపైనా అధ్యయనం చేస్తుందన్నారు. లవ్ జీహాద్‌‌ను వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఆర్డినెన్స్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే.