Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

‘రాచరికపు హోదా వద్దు..కామన్ లైఫే ముద్దు’

Harry and Meghan Plan to set a Production Company, ‘రాచరికపు హోదా వద్దు..కామన్ లైఫే ముద్దు’

బ్రిటిష్ రాయల్ దంపతులు హ్యారీ, ఆయన భార్య మేఘన్ మెర్కెల్ తమ ‘ రాచరికపు హోదా ‘ ను దాదాపు వదులుకున్నారు. ఇక తాము సాధారణ పౌరుల్లాగే జీవించాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. రాచరిక విధులనుంచి తప్పుకోవడంతో..  ‘ హిస్ రాయల్ హైనెస్’, ‘హర్ రాయల్ హైనెస్’, అలాగే ‘డ్యూక్ ఆఫ్ డచెస్’ హోదాలను కూడా ఈ జంట కోల్పోనుంది. తమ రాచరిక హోదాను వదులుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై ఈ దంపతులు సంతకాలు చేశారు. ఫలితంగా వీరికి ప్రభుత్వ నిధులు అందకుండా పోతాయి. హ్యారీ ప్రస్తుతం రాయల్ మెరైన్స్ దళానికి కెప్టెన్ జనరల్ గా వ్యవహరిస్తున్నారు. అయితే.. సోమవారం సాయంత్రానికి హ్యారీ గళం మారినట్టు కనిపించింది. ప్రస్తుతానికి తన రాయల్ హోదాను త్యజించడానికి సుముఖంగా లేనని ఆయన పేర్కొన్నారు. కెనడాకు వెళ్తూ మధ్యలో బ్రిటన్ లో ఆగిన ఆయన.. తామిద్దరం ప్రజలనుంచి దూరంగా వెళ్ళదలచుకోవడంలేదని తెలిపారు. ఏమైనా….  తమ ధార్మిక సంస్థ ద్వారా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నామని,  తమ ప్రొడక్షన్ కంపెనీ ద్వారా సామాజిక సమస్యలపై డాక్యుమెంటరీలు నిర్మిస్తామని అన్నారు.  చూడబోతే.. ఇప్పటికి మాత్రం  ఈ దంపతులు ‘ససెక్స్ రాయల్ బ్రాండ్’  ముద్రతోనే కొనసాగనున్నట్టు కనిపిస్తోంది.

 

Related Tags