హరీష్ వర్సెస్ బండ్ల.. వివాదం ముగిసేలా లేదుగా..!

హరీష్ శంకర్‌ వర్సెస్‌ బండ్ల గణేష్.. వీరిద్దరి మధ్య వార్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి కాంబోలో ‘గబ్బర్‌సింగ్’ రాగా అది పెద్ద విజయాన్ని సాధించింది. ఇటీవలే ఈ మూవీ విడుదలై ఎనిమిది సంవత్సరాలు కూడా పూర్తైంది. ఈ సందర్భంగా అందరికీ కృతఙ్ఞతలు చెప్పిన హరీష్ శంకర్,‌ నిర్మాత బండ్ల గణేష్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. అంతేకాదు థ్యాంక్స్‌ నోట్‌లో హీరోయిన్ శ్రుతీహాసన్‌ పేరును కూడా హరీష్ తెలపలేదు. దీంతో అక్కడే వివాదం మొదలైంది. […]

హరీష్ వర్సెస్ బండ్ల.. వివాదం ముగిసేలా లేదుగా..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 14, 2020 | 3:21 PM

హరీష్ శంకర్‌ వర్సెస్‌ బండ్ల గణేష్.. వీరిద్దరి మధ్య వార్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి కాంబోలో ‘గబ్బర్‌సింగ్’ రాగా అది పెద్ద విజయాన్ని సాధించింది. ఇటీవలే ఈ మూవీ విడుదలై ఎనిమిది సంవత్సరాలు కూడా పూర్తైంది. ఈ సందర్భంగా అందరికీ కృతఙ్ఞతలు చెప్పిన హరీష్ శంకర్,‌ నిర్మాత బండ్ల గణేష్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. అంతేకాదు థ్యాంక్స్‌ నోట్‌లో హీరోయిన్ శ్రుతీహాసన్‌ పేరును కూడా హరీష్ తెలపలేదు. దీంతో అక్కడే వివాదం మొదలైంది.

మీ పేరును ప్రస్తావించలేదు కదా, మీ ఇద్దరి మధ్య ఏవైనా మనస్పర్థలు వచ్చాయా..? అని బండ్ల గణేష్‌ను ప్రశ్నించగా.. ఆయన హరీష్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ”అది ఆయన సంస్కారం. ఫ్లాప్‌ల్లో ఉన్న హరీష్‌ శంకర్‌కు గబ్బర్ సింగ్ ఆఫర్ నేనే ఇప్పించాను” అని కామెంట్లు చేశారు. అంతటితో ఆగకుండా.. హరీష్ అన్నీ రీమేక్‌లు మాత్రమే చేయగలడు. అతడు ఒక్క స్ట్రైట్ సినిమా తీసి హిట్ కొడితే, తాను ఇండస్ట్రీ వదిలి వెళ్తానంటూ ఛాలెంజ్‌ కూడా విసిరారు. ఇక ఈ వ్యాఖ్యలకు హరీష్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు.

”ఇతరులు చేసే పనికి నేను పేర్లు పెట్టలేను. నిజానికి చెప్పాలంటే ఆంజనేయులు, తీన్‌మార్ రెండు ఫ్లాప్‌ల తరువాత నిర్మాతగా బండ్లకు మంచి హిట్ ఇచ్చింది నేను. గబ్బర్‌సింగ్ ఆఫర్‌ను నాకు పవన్ కల్యాణ్ ఇచ్చారు. మొదట ఈ సినిమాను నాగబాబు నిర్మించాలనుకున్నారు. క్రెడిబులిటి ఇవ్వని వారి గురించి నేను ఎక్కువగా మాట్లాడి సమయాన్ని వృధా చేసుకోను. నా టాలెంట్ ఏంటో అందరికీ తెలుసు. ఏదో హర్రీలో నేను బండ్ల గణేష్‌ పేరును మర్చిపోయాను. ఆ తరువాత ట్వీట్‌లో దాన్ని నేను సరిదిద్దుకున్నాను. మిరపకాయ్‌, సుబ్రమణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాథమ్‌ నా కెరీర్‌లో కమర్షియల్ హిట్‌లుగా నిలిచాయి. చిన్న చిన్న కామెంట్లను నేను పెద్దగా పట్టించుకోను. గబ్బర్‌సింగ్‌ సినిమాలోని బ్రహ్మానందం డైలాగ్‌లను నా అసిస్టెంట్ రాజశేఖర్‌ రాశారు. దానికి టైటిల్‌ కార్డులో ఆయన పేరును వేశాను” అని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం పవన్‌ కల్యాణ్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నానని ఆయన అన్నారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ వచ్చే ఏడాది మొదలవుతుందని తెలిపారు. మరి ఈ కామెంట్లపై బండ్ల ఎలా స్పందిస్తారో చూడాలి.

Read This Story Also:  ‘పుష్ప’.. ఆయన స్థానంలో మరొకరిని తీసుకోవాలనుకుంటోన్న సుకుమార్..!

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!