Breaking News
  • హైదరాబాద్ జాయింట్ కమిషనర్ అవినాష్ మహంతి. 139 మంది తనపై అత్యాచారం చేశారని ఆగస్టు 20 న పంజాగుట్ట పీఎస్ లో పిర్యాదు చేసిన.. కేసు సైబర్ క్రైమ్ కు ట్రాన్స్ఫర్ అయ్యింది. ప్రత్యేక దర్యాప్తు కోసం ఈ కేసు సీసీఎస్ కు బదిలీ అయింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కున్న కొంత మందిని ఇప్పటికే విచారించాము. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ శేకర్ అలియాస్ డాలర్ బాయ్ ని అరెస్ట్ చేసాము. ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాము. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఈ కేసును మహిళా ఏసీపి స్థాయి అధికారులతో విచారణ జరుపుతున్నాము.. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. బాధిత మహిళ నుండి ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేశాము. ఈ కేసును టెక్నికల్ అనాలసిస్ ద్వారా దర్యాప్తు చేశాము.
  • మహబూబాబాద్ జిల్లా: దీక్షిత్ రెడ్డి హత్య పై జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశం. బాలుడ్ని కిడ్నాప్ చేసి కిరాతకంగా చంపి హైటెక్ పద్దతిలో టెక్నాలజీ ఉపయోగించి డబ్బులు డిమాండ్ చేసిన అఘాంతకుడు మంద సాగర్ ను అరెస్ట్ , సెల్ ఫోన్ స్వాధీనం. ఈ నెల 18 సాయంత్రం 5.30 గంటల సమయంలో నేరస్థుడు పధకం ప్రకారం AP36 Q8108 ఫేక్ నెంబర్ బైక్ పై దీక్షిత్ ను తీసుకెళ్లిన హంతకుడు. సీసీ కెమెరాల కు దొరకకుండా దనమయ్య గుట్ట దగ్గర తీసుకెళ్లిన అఘాంతకుడు. దీక్షిత్ ఏడవడం మొదలు పెట్టిన్నప్పుడు దీక్షిత్ కు మత్తు టాబ్లెట్ ఇచ్చి కర్చీఫ్ తో చేతులు కట్టి దీక్షిత్ టీ షర్ట్ తో మెడకు ఉరి బిగించి చంపిన దుండగుడు. ఘటన జరిగిన స్థలం నుండి దీక్షిత్ తల్లికిఫోన్ చేసి 45 లక్షలు ఇవ్వాలని డిమాండ్. మంద సాగర్ ఒక్కడు మాత్రమే ఈ హత్యలో పాల్గోనాడు, మిగత వారికి ఎలాంటి సంభందం లేదు.
  • బీట్స్ ఆఫ్‌ రాధేశ్యామ్‌ విడుదల. ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా బీట్స్ ఆఫ్‌ రాధేశ్యామ్‌ని విడుదల చేసిన టీమ్‌. విజువల్‌ వండర్‌గా బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్‌. ప్రతి షాటూ అద్భుతంగా ఉందంటూ ప్రశంసల జల్లు. ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడ్డ రాధేశ్యామ్‌ టీమ్‌. కృష్ణంరాజు సమర్పిస్తున్న సినిమా రాధేశ్యామ్‌. రాధాకృష్ణకుమార్‌ డైరక్టర్‌, యువీ క్రియేషన్స్ నిర్మాణం. జస్టిన్‌ ప్రభాకరన్‌ బీట్స్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్. బీట్స్ ఆఫ్‌ రాధేశ్యామ్‌లో మూడు మతాలను పోట్రెయిట్‌ చేసిన టీమ్.
  • ఇంద్రకీలాద్రి: దసరా ఉత్సవాల ఆఖరి రోజు కృష్ణానది లో దుర్గమ్మ నదీ విహారంపై నెలకొన్న సందిగ్ధత . కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతుండడం తో ఈ నెల 25 న తెప్పోత్సవం నిర్వహించాలా లేదా అనే దానిపై డైలమాలో దుర్గగుడి అధికారులు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి వద్ద కొనసాగుతున్న 3 లక్షల 77 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో . తెప్పోత్సవం కు మరో రెండు రోజులు మాత్రమే సమయం . కృష్ణా నది లో వరద ఉధ్రుతి తగ్గితేనే తెప్పోత్సవానికి అనుమతులిస్తామంటున్న ఇరిగేషన్ శాఖ అధికారులు. ఇప్పటికే హంస వాహనాన్ని సిద్దం చేస్తున్న దుర్గగుడి అధికారులు . ఈ నెల 25 ఉత్సవాల అఖరి రోజైన ఆదివారం కృష్ణానది లో వరద ఉధ్రుతి కొనసాగితే తెప్పోత్సవాన్ని ఎలా నిర్వహించాలనే దానిపై తర్జన బర్జన పడుతున్న అధికారులు.
  • నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో రెండు రోజు పర్యటిస్తున్న కేంద్ర బృందం. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ఠ నాయకత్వం లో, కేంద్ర జలవనరుల విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం రఘురామ్, కేంద్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్ కె కుష్వారా లు నగరంలో పర్యటిస్తున్నారు. నాగోల్, బండ్లగూడ చెరువుల నుండి ఓవర్ ఫ్లో అయి నాలాలులోకి వస్తున్న, వరద నీరు, వరద ముంపుతో జరిగిన నష్టం గురించి అధికారులు, స్థానిక ప్రజల నుండి వివరాలు తెలుసుకున్నారు. ఎల్బీ నగర్ జోన్ హయత్ నగర్ సర్కిల్ నాగోల్ రాజరాజేశ్వరి కాలనీ లో ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించిన లించిన కేంద్రబృందం.
  • రవాణాశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరి సునీల్ శర్మ తో భేటి tsrtc అధికారులు . రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ భవనం లో మొదలయిన సమావేశం. సమావేశం లో పాల్గొన్న తెలంగాణ రవాణాశాఖ ఆపేరేషన్స్ ఈ.డి లు . ఈరోజు అంతరాష్ట్ర బస్సు సర్వుసుల ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం.

హరీశ్‌రావు సతీమణి సంచలన నిర్ణయం!

, హరీశ్‌రావు సతీమణి సంచలన నిర్ణయం!
  • రాజకీయాల్లోకి హరీశ్‌రావు సతీమణి
  • భర్త నియోజకర్గం నుంచే పోటీ
  • హరీశ్ పట్ల ప్రత్యేక ప్లాన్ వేసుకున్న కేసీఆర్
  • చక్రం తిప్పబోతున్న తెలంగాణ సీఎం
హైదరాబాద్: రాజకీయాల్లోకి హరీశ్‌రావు సతీమణి తన్నీరు శ్రీనిత ఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఇప్పుడిదే చర్చ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
, హరీశ్‌రావు సతీమణి సంచలన నిర్ణయం!
రమ్యారావు మేనత్త కొడుకుల్లో హరీశ్‌రావు ఒకరు
అందుకు కారణం టీపీసీసీ అధికార ప్రతినిధి ఆర్. రమ్యారావు. ఆమె కాంగ్రెస్ పార్టీకి చెందిన తాజా తెలంగాణ అనే వాట్సప్ గ్రూప్‌లో ఆసక్తికరమైన పోస్టింగ్ చేశారు. అందులో త్వరలో మరో నాలుగు నెలల్లో సిద్ధిపేటకు బై ఎలక్షన్. ఆ స్థానం నుంచి పోటీ చేయనున్న తన్నీరు శ్రీనిత అని ఆమె పోస్ట్ చేశారు. దీంతో అది అక్కడి నుంచి బాగా వైరల్‌గా మారింది.
రమ్యారావు మేనత్త కొడుకుల్లో హరీశ్‌రావు ఒకరు. అందువల్లనే ఆమె వాట్సప్‌లో చేసిన పోస్టింగ్‌కు ప్రాధాన్యత సంతరించుకుని, అది కాస్తా వైరల్‌గా మారింది. అదేమిటి అల్రెడీ అక్కడ హరీశ్‌రావు ఎమ్మెల్యేగా చేస్తున్నారుగా? అంటారా.. కరెక్టే కానీ హరీశ్‌రావును ఎంపీ స్థానానికి పోటీ చేయించాలని సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని కూడా వినిపిస్తోంది.
జాతీయ రాజకీయాల్లో పట్టు కోసమే!
జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పట్టు సాధించాలని ప్రయత్నిస్తోన్నారు. థర్డ్ ఫ్రంట్ కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హరీశ్‌రావును పట్ల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సిద్ధిపేట నియోజకవర్గానికి హరీశ్‌రావుతో రాజీనామా చేయించి ఎంపీగా పోటీ చేయించాలని కేసీఆర్ భావిస్తున్నారట. దీంతో పార్లమెంట్‌లో టీఆర్ఎస్‌కు బలమైన వాయిస్ ఉండేలా చూసుకోవాలేది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది.
రమ్యారావు అభిప్రాయం నిజమేనా?
కేసీఆర్ వ్యూహానికి అనుగుణంగా హరీశ్‌రావు సిద్ధిపేటకు రాజీనామా చేయనున్నారు. అటుపై జరగనున్న బైఎలక్షన్‌లో తన్నీరు శ్రీనిత టీఆర్ఎస్ తరుపున పోటీ చేస్తారట. దీంతో ఎన్నో ఏళ్లుగా సిద్ధిపేటను చూసుకుంటూ వచ్చిన హరీశ్‌రావు ఇప్పుడు ఆ బాధ్యతలను సతీమణి శ్రీనితకు అప్పగించడమే తప్పనిసరి కానుందన్నమాట. అయితే రమ్యారావు వాట్సప్‌లో వ్యక్తం చేసిన అభిప్రాయం వాస్తవమేనా? నిజంగా అలానే జరుగుతుందా? తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Related Tags