Breaking News
  • ఢిల్లీ: దేశవ్యాప్తంగా 56లక్షలు దాటిన కరోన కేసుల సంఖ్య, 90 వేలు దాటిన మృతుల సంఖ్య. దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 56, 46, 011 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. గడచిన 24 గంటల్లో 83, 347 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1, 085 మంది మృతి. 9, 68, 377 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 45, 87, 614 మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 90, 020 మంది మృతి. నిన్న ఒక్కరోజే కోలుకున్న 89, 746 మంది బాధితులు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 81.25%, మరణాల రేటు 1.59%.
  • యాదాద్రి: భువనగిరి ఏరియా ఆసుపత్రిలో శిశు విక్రయం కలకలం. 10 రోజుల పసికందు 60 వేల రూపాయలకు విక్రయించిన తల్లి. ఈనెల 12వ తేదీన ఏరియా ఆసుపత్రికి ప్రసవానికి వచ్చిన భువనగిరి మండలానికి చెందిన ఓ యువతి. యువతి తల్లి 60 వేల రూపాయలకు ఘట్కేసర్ మండలానికి చెందిన వారికి విక్రయం. రెండు రోజుల క్రితం నేరేడ్మెట్ పోలీసులు ఓ కేసు విషయంలో ఓ ఇద్దరిని విచారించగా ఈ ఘటన వెలుగులోకి. పుట్టిన పాపను భువనగిరి టౌన్ పోలీసులకు అప్పగింత.
  • తిరుమల: నేడు తిరుమలకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. నేడు తిరుమలకు విచ్చేయనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, కర్ణాటక సీఎం యడియూరప్ప. ఈరోజు సాయంత్రం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి గరుడ సేవలో పాల్గొననున్న సీఎం జగన్. ఈరోజు సాయంత్రం తిరుమలకు చేరుకోనున్న కర్ణాటక సీఎం యడియూరప్ప. ఈరోజు రాత్రి తిరుమలలోనే బస చేయనున్న ముఖ్యమంత్రులు. 24న ఉదయం శ్రీవారిని దర్శించుకుని నాదనీరాజనం వేదికపై వేద పారాయణంలో పాల్గొననున్న ముఖ్యమంత్రులు. అనంతరం ఉదయం 8.10 గంటలకు కర్ణాటక సత్రాల నూతన సముదాయ నిర్మాణానికి భూమిపూజ చేయనున్న సీఎం జగన్, యడియూరప్ప. అనంతరం తిరుగు ప్రయాణం.
  • కోటి 12 లక్షల లంచం కేసులో రెండవరోజు నిందితుల కస్టడి. ఐదుగురు నిందితులను రెండవ రోజు విచారించనున్న ఏసీబీ. ఆర్డీవో అరుణా రెడ్డి ని చంచల్ గూడ జైలునుండి ఏసీబీ కార్యాలయానికి తరలించినున్న ఏసీబీ అధికారులు. అడిషనల్ కలెక్టర్ నగేష్ తో పాటు మిగిలిన ముగ్గురు నిందితులను నాలుగు రోజుల పాటు ఏసీబీ అధీనం లోనే నిందితులు. నగేష్ బ్యాంక్ లాకర్ పై నేడు విచారణ. 40 లక్షలు ఎక్కడ అనే దానిపై రాని స్పస్టత . అవినీతి, బినామీ ఆస్తులపై ఏసీబీ ప్రశ్నంచనున్న ఏసీబీ. పలువురు అనుమానితులను, సాక్షులను విచారించనున్న ఏసీబీ.
  • అమరావతి: పట్టణ ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాపై ప్రభుత్వం కార్యచరణ. వివిధ జిల్లాల్లోని 21 పట్టణాలకు వివిధ రిజర్వాయర్ల నుంచి నీటి కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు. మొత్తంగా 50 పట్టణాల్లో రూ. 5050 కోట్ల ఏఐఐబీ నిధులతో మంచి నీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు.
  • రెండవ రోజు ముగిసిన నిందితుల కస్టడీ. మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ బినామీ లపై కొనసాగిన విచారణ. రెండవ రోజు బయట పడ్డ నగేష్ ముగ్గురు బినామీలు. ముగ్గురు బినామీలను విచారించిన ఏసీబీ. నగేష్ భినామిలో కీలక పాత్ర పోషించిన ఓ మహిళ బినామి. మెదక్, మనోహర బాద్, మేడ్చల్ ,కామారెడ్డి లో పలు అక్రమాలను గుర్తించిన ఏసీబీ. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది తో పాటు పలువురు కింది స్థాయి ఉద్యోగుల సైతం విచారించిన ఏసీబీ.
  • టీవీ9 చేతిలో హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసుల చార్జిషీట్‌. ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఆర్టీఐకి ఎక్సైజ్‌శాఖ రిప్లై. గత రెండేళ్లలో 12 డ్రగ్స్‌ కేసులు నమోదైనట్లు వెల్లడి. 12 కేసుల్లో 8 కేసుల్లోనే చార్జిషీట్‌ దాఖలు-ఎక్సైజ్‌శాఖ. టాలీవుడ్‌కు సంబంధించిన 4 కేసులపై సమాచారం ఇవ్వని శాఖ. ఎక్సైజ్‌శాఖ దాఖలుచేసిన 8 చార్జిషీట్లలో సంచలన అంశాలు.

సిద్దిపేట, దుబ్బాక నాకు రెండు కళ్లు: మంత్రి హరీష్ రావు

సిద్దిపేట, దుబ్బాక నాకు రెండు కళ్లు అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో బుధవారం మంత్రి పర్యటించారు. ఈ సంద‌ర్భం గా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
harish rao said it will be available to the dubaka public at all times, సిద్దిపేట, దుబ్బాక నాకు రెండు కళ్లు: మంత్రి హరీష్ రావు

సిద్దిపేట, దుబ్బాక నాకు రెండు కళ్లు అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో బుధవారం మంత్రి పర్యటించారు. ఈ సంద‌ర్భం గా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ..దుబ్బాక ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

దుబ్బాక అభివృద్ధి బాధ్యత నేనే తీసుకుంటానని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట తరహాలో దుబ్బాకను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. దుబ్బాక మహిళల తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపామ‌న్నారు. త్వరలోనే ప్రతి ఎకరాకు సాగునీరు అందించి శాశ్వత పరిష్కారం చూపుతామని వెల్లడించారు. నియోజకవర్గంలో లక్షా 35 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు. దుబ్బాక అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. దుబ్బాక అభివృద్ధికి ముఖ్యమంత్రి రూ.35 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు.

Related Tags