వారెవ్వా పోలీస్.. సమయస్ఫూర్తితో ప్రాణం కాపాడాడు!

ఉత్తరప్రదేశ్ లోని హర్దోయిలో భార్యభర్తల మధ్య స్వల్ప వివాదంతో భర్త శివకుమార్‌ క్షణికావేశానికి లోనయ్యాడు. గదిలోకి వెళ్లి గడియ వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అయితే అందోళన చెందిన భార్య వెంటనే పోలీసులు సమాచారమిచ్చింది. దీంతో మరింత వేగంగా స్పందించిన కానిస్టేబుల్‌ సురేంద్ర కుమార్‌ వాయు వేగంతో సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. అప్పటికే గదిలోపల శివకుమార్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిన సురేంద్రకుమార్‌ తలుపులు పగుల గొట్టి మరీ అతడిని కిందికి దించాడు. […]

వారెవ్వా పోలీస్.. సమయస్ఫూర్తితో ప్రాణం కాపాడాడు!
Follow us

| Edited By:

Updated on: Aug 22, 2019 | 11:19 AM

ఉత్తరప్రదేశ్ లోని హర్దోయిలో భార్యభర్తల మధ్య స్వల్ప వివాదంతో భర్త శివకుమార్‌ క్షణికావేశానికి లోనయ్యాడు. గదిలోకి వెళ్లి గడియ వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అయితే అందోళన చెందిన భార్య వెంటనే పోలీసులు సమాచారమిచ్చింది. దీంతో మరింత వేగంగా స్పందించిన కానిస్టేబుల్‌ సురేంద్ర కుమార్‌ వాయు వేగంతో సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. అప్పటికే గదిలోపల శివకుమార్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిన సురేంద్రకుమార్‌ తలుపులు పగుల గొట్టి మరీ అతడిని కిందికి దించాడు. కానీ శివకుమార్‌లో ఎలాంటి చలనం లేదు. ఏ మాత్రం నిరాశపడని సురేంద్ర అతనికి సీపీఆర్‌ (కార్డియో పల్మనరీ రెసస్కిటేషన్)థెరపీని ప్రారంభించాడు. కాపేటికి బాధితుడు స్పందించడంతో, ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడాడు.

బాధితుడిలో చలనం లేకపోవడంతో, ఛాతీపై అరచేతితో తడుతూ, సీపీఆర్‌ థెరఫీ ప్రయోగించానని, కొంత సమయం తరువాత అతను స్పందించి శ్వాస తీసుకోవడం ప్రారంభించాడని, చివరి క్షణాల్లో అతనికి ఊపిరి పోయడం చాలా సంతోషంగా ఉందని కానిస్టేబుల్ సురేంద్ర తెలిపారు. సరియైన సమయంలో వేగంగా, సమర్ధవంతంగా స్పందించి సత్వర చర్య చేపట్టిన సురేంద్ర కమార్‌కు తగిన బహుమతిని అందిస్తామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.