మాజీ స్పిన్నర్‌కి ‘ఖేల్‌ రత్న’ తిరస్కరణ!

Harbhajan asks how, మాజీ స్పిన్నర్‌కి ‘ఖేల్‌ రత్న’ తిరస్కరణ!

‘ఖేల్‌ రత్న’ అవార్డు కోసం టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ పెట్టుకున్న నామినేషన్‌ను ఇటీవల కేంద్ర క్రీడలు, యువజన వ్యవహరాల మంత్రిత్వశాఖ తిరస్కరించిన సంగతి తెలిసిందే. హర్భజన్‌ నామినేషన్‌ పత్రాలు ఆలస్యంగా రావడంతో ఆయన నామినేషన్‌ను కేంద్రం తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 39 ఏళ్ల ఈ క్రికెటర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశాడు. దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారమైన ‘ఖేల్‌ రత్న’ కోసం తాను గడువులోపలే అన్ని పత్రాలు సమర్పించానని, ఈ విషయంలో ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుందని, ఈ అంశాన్ని మరోసారి పరిశీలించాలని పంజాబ్‌ క్రీడాశాఖ మంత్రి రాణా గుర్మీత్‌ సింగ్‌ సోధీని భజ్జీ ఈ వీడియోలో కోరారు. తమ సేవలను గుర్తించి అవార్డులు ఇవ్వడం.. క్రీడాకారులకు గొప్ప ప్రోత్సాహం కల్పిస్తుందని, పంజాబ్‌ క్రీడాశాఖ ఇప్పటికైనా తన పత్రాలను కేంద్రానికి పంపాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *