Online Loan App: లోన్ యాప్స్ నిర్వాహకుల అరాచకం.. లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోయినా కుటుంబ సభ్యులను వేధిస్తున్న..

Online Loan App: తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్స్ అరాచకాలు రోజు రోజుకు వెలుగులోకి వస్తున్నాయి. రుణాల పేరుతో ప్రజలు మరింత వేధింపులకు

Online Loan App: లోన్ యాప్స్ నిర్వాహకుల అరాచకం.. లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోయినా కుటుంబ సభ్యులను వేధిస్తున్న..
Follow us

| Edited By: Balu

Updated on: Jan 04, 2021 | 11:46 AM

Online Loan App: తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్స్ అరాచకాలు రోజు రోజుకు వెలుగులోకి వస్తున్నాయి. రుణాల పేరుతో ప్రజలు మరింత వేధింపులకు గురి చేస్తున్నారు. ఆన్‌‌లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు తట్టుకోలేక మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లిలో చంద్ర మోహన్ అనే వ్యక్తి మృతి చెందాడు. 8 లోన్ యాప్స్‌లో లక్ష రూపాయలు లోన్ తీసుకున్న చంద్రమోహన్ అన్ని యాప్‌లకు వడ్డీలతో కలిపి రూ.6 లక్షలు చెల్లించాడు. డబ్బులు కట్టలేని పక్షంలో మరో యాప్‌ను సిఫార్సు చేసి మరి డబ్బులు కట్టించుకున్నారు.

వేధింపులు ఎక్కువ కావడంతో చంద్రమోహన్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కౌన్సెలింగ్ అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలని పోలీసులు సూచించడంతో నిన్న ఉదయం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దీంతో యాప్ నిర్వాహకులు భార్య, బంధువులు, స్నేహితులకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించారు. దీంతో మనస్తాపానికి గురైన చంద్రమోహన్ ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే చంద్రమోహన్ మృతి చెందినా లోన్ యాప్ నిర్వాహకుల అరాచకాలు ఆగడంలేదు. ఇంట్లో మృతదేహం ఉండగానే లోన్ యాప్ నిర్వాహకులు డబ్బుల కోసం కుటుంబ సభ్యులకు కాల్స్ చేస్తున్నారు. చంద్రమోహన్ మొబైల్‌తో పాటు భార్య, బంధువులు, స్నేహితులకు ఫోన్ చేస్తున్నారు. లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోయాడని చెప్పినా షూరిటీగా ఉన్నారు కాబట్టి డబ్బులు చెల్లించాలని వేధిస్తున్నారు. చంద్ర మోహన్ భార్య సంగీతకు ఉదయం నుంచి 46కాల్స్ వచ్చాయి. లిఫ్ట్ చేయకపోతే అసభ్య మెసేజ్‌లు పెట్టి వేధిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక చంద్రమోహన్ కుంటుంబ సభ్యులు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.