నువ్వెప్పటికీ నా కెప్టెన్‌వే..ధోనికి విరాట్ బర్త్ డే విషెస్

మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై విమర్శలు వచ్చిన ప్రతిసారీ ఆయనకు తాజా కెప్టెన్ విరాట్ కోహ్లి  అండగా నిలిచాడు. ధోనీపై మాట పడనిచ్చేవాడు కాదు. మిడిల్ ఆర్డర్ ధోనిని మించిన ఆటగాడు లేడని..ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్ అంటూ మద్దతుగా నిలుస్తూ వస్తున్నాడు. ఎప్పటికీ ధోనీనే తన కెప్టెన్ అని ఎన్నోసార్లు చెప్పాడు. ఇదే విషయాన్ని మళ్లీ స్పష్టం చేశాడు. నేడు ఎమ్మెస్డీ  38వ పుట్టినరోజును సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కోహ్లీ ట్వీట్ చేశాడు. […]

నువ్వెప్పటికీ నా కెప్టెన్‌వే..ధోనికి విరాట్ బర్త్ డే విషెస్
Follow us

|

Updated on: Jul 07, 2019 | 7:33 PM

మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై విమర్శలు వచ్చిన ప్రతిసారీ ఆయనకు తాజా కెప్టెన్ విరాట్ కోహ్లి  అండగా నిలిచాడు. ధోనీపై మాట పడనిచ్చేవాడు కాదు. మిడిల్ ఆర్డర్ ధోనిని మించిన ఆటగాడు లేడని..ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్ అంటూ మద్దతుగా నిలుస్తూ వస్తున్నాడు. ఎప్పటికీ ధోనీనే తన కెప్టెన్ అని ఎన్నోసార్లు చెప్పాడు. ఇదే విషయాన్ని మళ్లీ స్పష్టం చేశాడు. నేడు ఎమ్మెస్డీ  38వ పుట్టినరోజును సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కోహ్లీ ట్వీట్ చేశాడు.

‘హ్యాపీ బర్త్‌డే మహి భాయ్. నమ్మకం, గౌరవం అనే పదాలకు అర్థం చాలా కొంత మందికి మాత్రమే తెలుస్తుంది. నాకు అలాంటి ఫ్రెండ్‌షిప్ దొరికినందుకు, నీతో ఎన్నో ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. మా అందరికి నువ్వొక పెద్దన్నయ్యవు. నేను గతంలో చెప్పినట్లుగా, నువ్వు ఎప్పటికీ నా కెప్టెన్‌వే’ అని కోహ్లీ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ద్వారా ధోనీపై ఉన్న ప్రేమను కోహ్లీ మరోసారి చాటుకున్నాడు.