అంబరాన్నంటిన న్యూ ఇయర్ వేడుకలు..

2019 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. మరో కొత్త సంవత్సరానికి వెల్‌కం చెప్తూ.. కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేకుండా చిన్నాపెద్దా అంతా కలిపి దేశవ్యాప్తంగా నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ఇక 2019కి సెలవు చెప్పి సరిగ్గా 12 గంటలు దాటగానే 2020కి స్వాగతం పలికారు. దేశ వ్యాప్తంగా యువత అంతా విందు వినోదాల్లో మునిగి తేలుతోంది. సరిగ్గా 12.00 గంటలకు ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి కేరింతలు కొడుతూ.. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు యువత. […]

అంబరాన్నంటిన న్యూ ఇయర్ వేడుకలు..
Follow us

| Edited By:

Updated on: Jan 01, 2020 | 1:10 AM

2019 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. మరో కొత్త సంవత్సరానికి వెల్‌కం చెప్తూ.. కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేకుండా చిన్నాపెద్దా అంతా కలిపి దేశవ్యాప్తంగా నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ఇక 2019కి సెలవు చెప్పి సరిగ్గా 12 గంటలు దాటగానే 2020కి స్వాగతం పలికారు. దేశ వ్యాప్తంగా యువత అంతా విందు వినోదాల్లో మునిగి తేలుతోంది. సరిగ్గా 12.00 గంటలకు ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి కేరింతలు కొడుతూ.. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు యువత.

ఇక తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ, తిరుపతి, వరంగల్‌లో 2020 కొత్త సంవత్సరానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేకమైన డ్యాన్స్‌ షోలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కార్యక్రమాలు నిర్వహించారు.

ఇక నగరంలోని సైబరాబద్‌ పోలీసులు న్యూ ఇయర్ వేడుకలు గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ నిర్వహించుకున్నారు. హైటెక్‌సిటీ వద్ద సీపీ సజ్జనార్‌ కేక్‌ కట్‌ చేసి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. ఈ సెలబ్రేషన్ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.