Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

సాహోరే ‘బాహుబలి’.. ప్రభాస్ గురించి ఆసక్తికర నిజాలు

‘ఈశ్వర్‌’, ‘రాఘవేంద్రు’డి ఆశీర్వాదాలతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ‘వర్షం’ కురిపిస్తూ.. ‘ఛత్రపతి’లా ఉత్తరాదిన కూడా ‘చక్రం’ తిప్పుతూ.. ‘బాహుబలి’తో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించి..  ‘రెబల్‌’స్టార్ బిరుదుతో.. అందరి చేత మా ‘డార్లింగ్’ ‘మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్’ అనిపించుకుంటూ.. తన అందంతో అమ్మాయిలకు ‘మిర్చి’ ఘాటు పుట్టిస్తూ.. కాంట్రవర్సరీలు లేని ‘యోగి’గా.. ‘పౌర్ణమి’ నాటి చంద్రుడిలా.. సింపుల్‌గా ఉంటూ అభిమానులకు ఎప్పటికీ ‘బుజ్జిగాడు’లా.. ఇప్పటికీ బ్రహ్మచారి ‘ఏక్ నిరంజన్‌’లా.. ‘మున్నా’ భాయి నీకిదే మా ‘సాహో’ అంటూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేరును లిఖించుకున్నాడు మన ‘అడవి రాముడు’ ప్రభాస్‌.

పెదనాన్న, రెబల్‌స్టార్ కృష్ణంరాజు సినీ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్‌కు టాలీవుడ్ ఎంట్రీ ఈజీగానే జరిగినప్పటికీ.. కెరీర్ ప్రారంభంలో అతడికి కూడా ‘సినిమా’ కష్టాలు ఎదురయ్యాయి. అయితే వాటితో ఏ మాత్రం డీలా పడని ప్రభాస్.. విభిన్న కథలను ఎంచుకుంటూ హిట్లను కొట్టి.. టాప్ హీరోల లిస్ట్‌లో చేరిపోయాడు. ఇక బాహుబలి చిత్రంతో అంతర్జాతీయంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఈ సినిమా కోసం ఆయన పడ్డ కష్టం కూడా చాలానే ఉంది. దాదాపు ఐదేళ్ల పాటు మరో చిత్రాన్ని ఒప్పుకోకుండా కేవలం బాహుబలికే సమయాన్ని కేటాయించాడు ప్రభాస్. వరుస సినిమాలతో బిజీగా ఉండే ఏ స్టార్‌ హీరో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకునేందుకు సాహసించారు. అందుకే దర్శకధీరుడు రాజమౌళి కూడా ప్రభాస్‌‌కు మరిచిపోలేని హిట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. అంతేకాదు అసలు ప్రభాస్ లేకుంటే బాహుబలి ఉండేదే కాదంటూ ఆయన కితాబిచ్చాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. పీరియాడికల్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తోంది.

ప్రభాస్ గురించి ఆసక్తికర నిజాలు:
1. చిన్నప్పటి నుంచి ఇంట్లో సినీ వాతావరణమే ఉన్నప్పటికీ.. పెద్దయ్యాక ఏదైనా వ్యాపారం చేయాలని ప్రభాస్ అనుకున్నాడట. హీరో అవుతానని అనుకోలేదట.
2. ప్రభాస్‌ను ఆయన స్నేహితులు సరదాగా హీరో అని పిలిచేవారట
3. విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్‌ కోసం విశ్వామిత్రుడి పాత్రలో ప్రభాస్ నటించాడు.
4. థాయిలాండ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బాహుబలి రూపంలో ఉన్న ప్రభాస్ మైనపు బొమ్మను ఉంచారు. దక్షిణాది నుంచి ఈ ఘనత అందుకున్న మొదటి హీరో ప్రభాస్.
5. ప్రభాస్ మొదటిసారి గెస్ట్‌ రోల్‌లో కనిపించిన చిత్రం యాక్షన్‌ జాక్సన్. ఇందులో ఓ పాటలో ప్రభాస్ కనిపిస్తాడు.
6. ప్రభాస్‌కు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం.
7.హిందీ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ అంటే ప్రభాస్‌కు గౌరవం.

కాగా ఇవాళ ప్రభాస్ 40వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు అభిమానుల నుంచి కూడా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఆయన కెరీర్ ఇకపై కూడా అద్భుతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ.. టీవీ9 తెలుగు తరఫున హ్యాపీ బర్త్‌డే ప్రభాస్.