‘హ్యాపీ బర్త్ డే’ కళ్యాణ్ రామ్..!

నందమూరి నట వారసత్వాన్ని పునికి పుచ్చుకుని.. విభిన్న కథలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు కల్యాణ్ రామ్. బాలగోపాలుడు చిత్రంతో బాలనటుడిగా సినిమాల్లో అరంగేట్రం చేశాడు. తొలిచూపులోనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. పటాస్‌తో వసూళ్ల పటాసులు పేల్చిన కళ్యాణ్ రామ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. 1978 జూలై 5న హైదరాబాద్​లో జన్మించాడు కల్యాణ్​ రామ్​. కోయంబత్తూరులో ఇంజినీరింగ్ పూర్తి చేసి.. అమెరికాలోని ఇల్లినాయిస్ ఇన్​స్టిట్యూట్​లో ఎమ్​.ఎస్. చేశాడు. స్వాతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. […]

'హ్యాపీ బర్త్ డే' కళ్యాణ్ రామ్..!
Follow us

| Edited By:

Updated on: Jul 05, 2019 | 8:46 AM

నందమూరి నట వారసత్వాన్ని పునికి పుచ్చుకుని.. విభిన్న కథలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు కల్యాణ్ రామ్. బాలగోపాలుడు చిత్రంతో బాలనటుడిగా సినిమాల్లో అరంగేట్రం చేశాడు. తొలిచూపులోనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. పటాస్‌తో వసూళ్ల పటాసులు పేల్చిన కళ్యాణ్ రామ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు.

1978 జూలై 5న హైదరాబాద్​లో జన్మించాడు కల్యాణ్​ రామ్​. కోయంబత్తూరులో ఇంజినీరింగ్ పూర్తి చేసి.. అమెరికాలోని ఇల్లినాయిస్ ఇన్​స్టిట్యూట్​లో ఎమ్​.ఎస్. చేశాడు. స్వాతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కల్యాణ్​రామ్​కు శౌర్య రామ్, తారక అద్వైత సంతానం. 2003లో ఉషాకిరణ్ మూవీస్​ పతాకంపై వచ్చిన ‘తొలిచూపులోనే’ చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేశాడు కల్యాణ్​రామ్. అభిమన్యు, అసాధ్యుడు లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2005లో వచ్చిన అతనొక్కడే సినిమాతో రికార్డు సృష్టించాడు. లక్ష్మీ కల్యాణం, పటాస్, ఇజం, ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, 118 లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించాడు.

ఇక తాత నందమూరి తారక రామారావు పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్​ బ్యానర్​ను ప్రారంభించాడు. నిర్మాతగా తొలి చిత్రం అతనొక్కడే. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. అనంతరం వరుసగా తానే హీరోగా హరేరామ్, జయీభవ, కల్యాణ్​రామ్ కత్తి, ఓమ్ 3డీ, పటాస్, ఇజం లాంటి సినిమాలు నిర్మించాడు. అంతేకాకుండా రవితేజ హీరోగా కిక్​ 2, సోదరుడు జూనియర్ ఎన్టీఆర్​తో జై లవకుశ చిత్రాలను కూడా నిర్మించాడు. ఇందులో జై లవకుశ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన రావన్ మహరాజ్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే పేరుతో కల్యాణ్‌ రామ్‌ సినిమా చేయనున్నాడు. మల్లిడి వేణు దర్శకుడిగా కల్యాణ్ రామ్‌ సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ట్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాకు తుగ్లక్‌ అనే టైటిల్‌ను పరిశీలించినా ఫైనల్‌గా రావణ అయితే బాగుటుందని ఫిక్స్‌ అయ్యారు. అయితే ఈ టైటిల్‌తో మోహన్‌బాబు ప్రధాన పాత్రలో 100 కోట్లతో పౌరాణిక చిత్రాన్ని ప్లాన్‌ చేశారు. 118 హిట్‌తో తిరిగి ఫాంలోకి వచ్చిన కల్యాణ్ రామ్‌ ఆ జోష్‌ను కంటిన్యూ చేసేందుకు కష్టపడుతున్నాడు. మరి రావణ మరో హిట్ ఇస్తాడేమో చూడాలి.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?