Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

కడుపునొప్పితో ఆస్పత్రికి..బాబోయ్.. కడుపులో అరకేజీ జుట్టు

Scanning report of Indian girl shocks doctors and parents, కడుపునొప్పితో ఆస్పత్రికి..బాబోయ్.. కడుపులో అరకేజీ జుట్టు

కడుపునొప్పి వస్తే డైజీషన్ ప్రాబ్లం అనుకుని వదిలేస్తాం. మరి ఎక్కువగా ఉంటే ఓ టాబ్లెట్‌తో సరిపెట్టుకుంటాం.  అదేపనిగా వస్తుంటే డాక్టర్లు స్కానింగ్ చేసి..కడుపులో కణితిలు ఏమైనా ఉంటే ఆఫరేషన్ చేసి తీసేస్తారు. అయితే కణితికి బదులు కడుపులో అరకేజీ జుట్టు దర్శనమిస్తే..ఆశ్యర్యపోరా..?. వైద్యులు అయితే ఏకంగా షాక్‌కి గురయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని కోయంబత్తూరు చెందిన ఓ 13 ఏళ్ల బాలిక ప్రతిరోజూ కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో పేరెంట్స్ దగ్గర్లోని వీజీఎమ్ ఆస్పత్రకి తరలించారు. అయితే స్కాన్ చేసిన డాక్టర్స్ లోపల ఏదో నల్లటి పదార్ధం కడుపులో ఉందని గుర్తించారు..కానీ అదేంటన్నది అర్ధం కాలేదు. వెంటే ఆపరేషన్ చేయగా..బాలిక కడుపలో అరకేజీ జుట్టు దర్శనమిచ్చింది. జుట్టు మాత్రమే కాదు షాంపూ పాకెట్లు, ఇంకొన్ని ప్లాస్టిక్ వస్తువులు కూడా ఉన్నాయి. వాటన్నింటిని తొలగించిన వైద్యులు..ఆమెకు బెడ్ రెస్ట్ సజిస్ట్ చేశారు. దీనిపై తల్లిదండ్రులు స్పందించారు. తమ కుమార్తె మానసిక వ్యాధితో బాధపడుతోందని..అందుకే ఇలా చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బాలిక కోలుకుంటోంది.

 

Related Tags