సైకో కిల్లర్ శ్రీనివాస్ ‌రెడ్డి వరంగల్ జైలుకు

భువనగిరి: సంచలనం సృష్టించిన హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాసరెడ్డికి పోలీస్ కస్టడీ ముగిసింది. ఈ నెల 8న పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసులు నమోదవడంతో కస్టడీ కోసం నల్గొండలోని మొదటి అదనపు జిల్లా జడ్జి కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతినిస్తూ ఈ నెల 8న కోర్టు రాచకొండ కమిషనరేట్ పోలీసులకు ఆదేశాలిచ్చింది. ఆ రోజు నుంచి రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో విచారణ నిర్వహించిన తర్వాత.. నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ప్రత్యేక భద్రత నడుమ వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు. కాగా కష్టడీ సమయంలో శ్రీనివాసరెడ్డి నోరువిప్పలేదని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *