ప్రవీణ్‌కు ఉరిశిక్ష..! మరి సైకో శ్రీనివాస్‌కు..? ఇంకా సాక్ష్యాల్లోనే కేసు

Police presents strong evidence to court against Psycho Killer

తెలంగాణలో సంచలనం సృష్టించిన హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి కేసులో పోలీసులు కీలక సాక్ష్యాలు సేకరించారు. హత్యలు జరిగిన ప్రదేశంలో శ్రీనివాస్ ఫోన్ సిగ్నల్స్‌ను పోలీసులు గుర్తించారు. అతడి చేతిలో దారుణ హత్యాచారానికి గురైన శ్రావణి, మనీషా, కల్పన మృతదేహాలపై రక్తపు మరకలను సేకరించిన పోలీసులు.. ఫోరెన్సిక్ రిపోర్ట్ ద్వారా అవి శ్రీనివాస్‌రెడ్డివేనని తేల్చారు. ఇక ఈ కేసులో మొత్తం 300మంది సాక్షులను విచారించిన పోలీసులు, సైకో కిల్లర్ అరాచకాలకు సంబంధించిన బలమైన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. కాగా ఇటీవల హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారిపై హత్యాచారం చేసిన ప్రవీణ్‌కు 48రోజుల్లో వాదోపవాదాలను ఆలకించిన కోర్టు ఉరిశిక్షను ఖరారు చేయగా.. శ్రీనివాస్ కేసులో మాత్రం ఇంకా పురోగతి లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *