ఇలాంటి మృగాన్ని ఉరి తీయాల్సిందే..!

సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని ఉరితీసేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్నారు హాజీపూర్, బొమ్మలరామారం గ్రామస్తులు. శ్రీనివాస్ రెడ్డి సీరియల్ హత్యల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా కేసును పరిష్కరించి, ఉరితీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మానవ మృగం శ్రీనివాస్ రెడ్డిని ఉరేయాలంటూ చిన్నారి శ్రావణి తల్లిదండ్రులు బొమ్మల రామారంలో దీక్ష చేయాలని నిర్ణయించారు.

శ్రావణి, మనీషా, కల్పన సహా కర్నూలులో ఓ మహిళను తానే హత్య చేసినట్టు శ్రీనివాస్ రెడ్డి పోలీస్ కస్టడీలో ఒప్పుకున్నాడు. 6 రోజుల కస్టడీలో ఇంతకు మించి నోరు మెదపలేదు. సైకో శ్రీనివాస్ రెడ్డి మరిన్ని నేరాలు చేసి వుంటాడని భావించిన పోలీసులు.. కస్టడీలో అతని నుంచి కీలక సమాచారం రాబట్టాలనుకున్నారు. కానీ.. అలాంటిదేమీ తెరపైకి రాలేదు. కస్టడీ గడువు ముగియడంతో శ్రీనివాస్ రెడ్డిని మళ్లీ జైలుకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *