మీ జుట్టు రాలిపోతుందా? అయితే ఇలా చేసి చూడండి

Hair fall problem treatment at home and six home remidies, మీ జుట్టు రాలిపోతుందా? అయితే  ఇలా చేసి చూడండి

మనిషికి అందాన్నిచ్చేది జట్టు. అది మనుషుల వంశపారంపర్య లక్షాణాలను బట్టి ఆధారపడి ఉంటుంది. కొంతమందికి ఒత్తుగా, మరికొందరికి సిల్కీగా, ఇంకొందరికి ఉంగరాలు తిరిగి, ఇంకా కొందరికి పలచగా.. ఇలా ఎన్నో రకాలుగా జట్టు ఉన్నవాళ్లుంటారు. వీరంతా కూడా రాలిపోతున్న జట్టు సమస్యతో తెగ బాధపడిపోతారు. ఈ క్రింద తెలిపిన ఆయుర్వేద చిట్కాలను క్రమం తప్పకుండా పాటించి చూడండి. ఫలితాలు తప్పకచూస్తారు.

జట్టు రాలిపోడానికి కారణాలు:

పోషకాహారలోపం, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్‌, పిల్లలు పుట్టకుండా వాడే కాంట్రాసెప్టివ్ పిల్స్‌ వల్ల, విపరీతమైన ఒత్తిడి కారణంగా, అలాగే శరీరానికి హానికలిగించే కెమికల్స్‌తో తయారైన హెయిర్‌ ప్రాడెక్టులు వినియోగించడం. వీటితో పాటు స్లిమ్‌గా కనిపించాలని తక్కువగా తినడం, జడను బిగదీసి వేసుకోవడం, సి విటమిన్‌ లోపం వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతూ ఇబ్బంది కలిగిస్తాయి.

జట్టు రాలిపోకుండా ఉండాలంటే:

  • జుట్టు రాలడం, పొడిబారడం, చుండ్రు వంటి సమస్యలతో బాధపడేవారికి మెంతులు మంచి పరిష్కారాన్ని ఇస్తాయి. దీనికోసం ఒక కప్పు మెంతులను రాత్రంతా పుల్లటి పెరుగులో నానబెట్టి, ఉదయాన్నే పెరుగుతో సహా రుబ్బుకుని తలకు పూతలా వేసుకోవాలి. ఒక అరగంట తర్వాత తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలను తగ్గించవచ్చు.
  • జుట్టు రాలే సమస్యకు వేప మంచి ఫలితాన్ని ఇస్తుంది. వేప నూనెను తలకు రాసుకుంటే జట్టు రాలే సమస్యతో పాటు ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు ఉన్నా తగ్గుతాయి. అదే విధంగా వేపాకు కూడా బాగా నూరి పేస్ట్ లా తయారు చేసి దాన్ని తలకు పట్టించినా జుట్టు సమస్యలు తీరిపోతాయి.
  • గోరింటాకు చేతికి పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో .. జుట్టుకు పెట్టుకుంటే శిరోజాలకు అంత ఆరోగ్యం కూడా. గోరింటాకు బాగా నూరి దాన్ని తలకు అద్దుకుని ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే కూడా ఫలితం కనిపిస్తుంది.
  • కలబంద గుజ్జును తలకు పట్టిస్తే జుట్టు రాలే సమస్యనుంచి రక్షించుకోవచ్చు.
  • తలస్నానం చేసేముందు కొబ్బరి నూనెను గోరువెచ్చగా కాచి తలకు రుద్దుకుని మర్దనా చేసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల తలకు బాగా రక్తప్రసరణ జరిగి కుదుళ్లు గట్టిపడతాయి.
  • జుట్టు రాలే సమస్యకు ఉల్లి బాగా ఉపయోగపడుతుంది. ఉల్లిరసాన్ని కుదుళ్లకు పట్టించడం వల్ల జుట్టు ఊడడం తగ్గిపోతుంది. ఉల్లిలో సల్ఫర్‌ అధికంగా ఉంటుంది. ఉల్లిరసంలోని యాంటిబాక్టీరియల్‌ గుణాలు తలలోని బాక్టీరియా, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. అందుకే ఉల్లిపాయను గ్రైండ్‌ చేసి ఆ గుజ్జు నుంచి రసం తీయాలి. ఆ రసాన్ని తలకు రాసుకుని అరగంటపాటు అలానే ఉంచుకోవాలి. ఆ తర్వాత నీటితో వెంట్రుకలను బాగా కడుక్కుని షాంపుతో తల రుద్దుకోవాలి. ఇది జుట్టు కుదుళ్లకు రక్తం బాగా సరఫరా అయ్యేట్టు చేస్తుంది.

ఈ విధానాల్లో ఏదో ఒకటి క్రమం తప్పకుండా పాటిస్తే జుట్టు రాలే సమస్యనుంచి తప్పించుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *