శివకు పోటీ వినోత్… అజిత్‌కి నచ్చాడు!

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ స్టయిలే వేరు. తన దర్శకుల పట్ల చూపే ఆదరణ చాలా గొప్పగా ఉంటుంది. ఆయనకు ఎవరైనా నచ్చితే.. ఖచ్చితంగా వరుస అవకాశాలు ఇస్తారు. దానికి ఉదాహరణే దర్శకుడు శివ. 2014లో శివతో ‘వీరమ్’ అనే సినిమా చేసిన అజిత్.. అతని వర్క్‌పై నమ్మకంతో 2019 వరకు శివతోనే మూడు సినిమాలు చేశారు.

తాజాగా ఇలాంటి అవకాశమే ఖాకీ దర్శకుడు హెచ్. వినోత్ దక్కించుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలోనే అజిత్ హిందీ హిట్ సినిమా ‘పింక్’ తమిళ రీమేక్‌లో నటిస్తున్నారు. ఇక ఇప్పటివరకు జరిగిన షూట్ తాలూకు ఔట్‌పుట్ అజిత్‌కు బాగా నచ్చడంతో తన 60వ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం అతనికే అప్పగించాడని సమాచారం. ఇక ఆ సినిమా కూడా బాగా తీయగలిగితే అజిత్ అతనికి మరో అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *