అమెరికా.. హెచ్-1 బీ వీసా రద్దుతో భారతీయులకు చిక్కులు

అమెరికాలో హెచ్ 1 బీ వర్క్ వీసా లేదా గ్రీన్ కార్డు కలిగిన అనేకమంది భారతీయులకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. అక్కడే పుట్టిన వారి పిల్లలను కూడా కష్టాలు వెన్నాడుతున్నాయి. హెచ్-1 బీ వీసా కార్డు రద్దు పెద్ద ఇబ్బందిగా మారింది. అమెరికాలోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఎయిరిండియా విమానాలు సిధ్ధంగా ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ లింక్ తో కూడిన ట్రావెల్ ఆంక్షల ఫలితంగా వారు స్వదేశానికి రాలేకపోతున్నారు. భారత ప్రభుత్వం గత నెలలో జారీ చేసిన […]

అమెరికా.. హెచ్-1 బీ వీసా రద్దుతో భారతీయులకు చిక్కులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 12, 2020 | 4:32 PM

అమెరికాలో హెచ్ 1 బీ వర్క్ వీసా లేదా గ్రీన్ కార్డు కలిగిన అనేకమంది భారతీయులకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. అక్కడే పుట్టిన వారి పిల్లలను కూడా కష్టాలు వెన్నాడుతున్నాయి. హెచ్-1 బీ వీసా కార్డు రద్దు పెద్ద ఇబ్బందిగా మారింది. అమెరికాలోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఎయిరిండియా విమానాలు సిధ్ధంగా ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ లింక్ తో కూడిన ట్రావెల్ ఆంక్షల ఫలితంగా వారు స్వదేశానికి రాలేకపోతున్నారు. భారత ప్రభుత్వం గత నెలలో జారీ చేసిన నిబంధనలను గతవారమే అప్ డేట్ చేసింది. ఈ మేరకు విదేశీయుల వీసాలు, ఓసీఐ కార్డులను తాత్కాలికంగా రద్దు చేస్తూ వీటిని రూపొందించారు. నిజానికి ప్రవాస భారతీయుల వీసా ఫ్రీ ట్రావెల్ ప్రివిలేజిలకు ఇవి ఉపయోగపడతాయన్న విషయం గమనార్హం. కానీ  అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి కొత్త ఆంక్షలు విధించడం యుఎస్ లోని భారతీయులకు పెద్ద సమస్యగా మారింది. న్యూజెర్సీలో ఓ భార్యాభర్తల జంట హెచ్-1 బీ వీసా జాబ్ ను కోల్పోవడంతో చట్ట ప్రకారం 60 రోజుల్లోగా తిరిగి ఇండియాకు వచ్చేద్దామని అనుకున్నారు. తమ ఇద్దరు చిన్న పిల్లలతో వీరు నెవార్క్ విమానాశ్రయానికి చేరుకోగా.. వారి పిల్లలని ఎయిరిండియా అనుమతించలేదు. కారణం ఈ జంటకు ఇండియన్ వీసా ఉన్నప్పటికీ.. అమెరికాలో పుట్టిన పిల్లలు అమెరికన్లే అవుతారు గనుక ఆ పిల్లలను అనుమతించేది లేదని ఎయిరిండియా వర్గాలు స్పష్టం చేశాయట.. దీంతో ఆ చిన్న కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఇంకా యుఎస్ లో అనేక భారతీయ జంటలు ఇలాగే  అయోమయంలో ఉన్నాయి.