హోం మంత్రి మహమూద్ అలీ, మండలి ఛైర్మన్ గుత్తా దిగ్భ్రాంతి

మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతిపట్ల శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హోం మంత్రి మహమూద్ అలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనారోగ్యంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వర్గస్తులైన మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి గారి మరణం తెలంగాణ ప్రజలకు తీరని లోటని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కార్మిక నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా తెలంగాణ ప్రజలకు ఆయన ఎనలేని సేవలందించారని గుత్తా సుఖేందర్ రెడ్డి […]

హోం మంత్రి మహమూద్ అలీ, మండలి ఛైర్మన్ గుత్తా దిగ్భ్రాంతి
Follow us

|

Updated on: Oct 22, 2020 | 8:48 AM

మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతిపట్ల శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హోం మంత్రి మహమూద్ అలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనారోగ్యంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వర్గస్తులైన మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి గారి మరణం తెలంగాణ ప్రజలకు తీరని లోటని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కార్మిక నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా తెలంగాణ ప్రజలకు ఆయన ఎనలేని సేవలందించారని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారితో కలిసి నర్సన్న పోరాటం చేసారని, తెలంగాణ రాష్ట్ర తొలి హో మినిష్టర్ గా పని చేసి రాష్టా శాంతి భద్రతలు కాపాడటంలో నాయిని నర్సింహారెడ్డి గారు చాలా కృషి చేశారని గుత్తా తెలిపారు. నాయిని ఆత్మకు శాంతిచేకూరాలని కోరుతూ, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని సుఖేందర్ రెడ్డి తెలిపారు.

మరోవైపు, అపోలో ఆసుపత్రిలో నాయిని భౌతిక దేహానికి హోం మంత్రి మహమూద్ అలీ నివాళులు అర్పించారు. నాయిని కుటుంబ సభ్యులను ఓదార్చారు. టిఆర్ఎస్ సీనియర్ నేత మరణించడం తీరని లోటుగా పేర్కొన్న అలీ, కేసీఆర్ కి ఆత్మీయ లీడర్ గా నర్సన్న ఉండేవారని పేర్కొన్నారు. నాయని తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు… వారంలో రెండు మూడు సార్లు తరచూ మాట్లాడుతూ ఉండేవాడు అని అలీ తమ అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.

'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్ లో వర్క్ ఫ్రం హోం చేసిన టెకీ!
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్ లో వర్క్ ఫ్రం హోం చేసిన టెకీ!
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు