Breaking News
  • 'మా' అసోసియేషన్‌లో ముసలం. నిన్నటి నుంచి తెరుచుకోని ఆఫీస్‌ తలుపులు. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య విభేదాలతో ఆఫీస్‌కు రాని సిబ్బంది. మాట్లాడేందుకు నిరాకరించిన కార్యవర్గ సభ్యులు.
  • బిల్లులపై చర్చ జరగకుండానే ఏపీ మండలి వాయిదా పడే అవకాశం. బిల్లుపై చర్చకు ఒప్పించేందుకు వైసీపీ సభ్యుల ప్రయత్నాలు. అంగీకరించని విపక్ష సభ్యులు. రూల్‌ 71పై చర్చ జరగాలని పట్టుబట్టిన విపక్ష సభ్యులు.
  • హైదరాబాద్‌: ధరమ్‌ కరం రోడ్‌లో పిచ్చికుక్కల స్వైరవిహారం. 10 మంది చిన్నారులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • తిరుమల: రథసప్తమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు-టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి.
  • హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయాలను డబ్బు శాసిస్తోంది. రాజ్యాధికారం సాధిస్తేనే విద్య, ఉద్యోగాలు వస్తాయి-లక్ష్మణ్‌. డబ్బుతో రాజకీయాలు నడపడం అప్రజాస్వామికం. దళితుల హక్కుల కోసం చేసే పోరాటంలో బీజేపీ ముందుంటుంది -తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌.

‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్: గుత్తా జ్వాల ప్రశ్నలకు సమాధానాలున్నాయా..!

Disha murder case accused encounter, ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్: గుత్తా జ్వాల ప్రశ్నలకు సమాధానాలున్నాయా..!

దిశ హత్య కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు విమర్శలు కురిపిస్తున్నారు. ఎన్‌కౌంటర్ పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని నిందితులను హతమార్చడం హేయమైన చర్య అని, దీని వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని పలువురు రాజకీయ ప్రముఖులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వారిలో మేనకా గాంధీ, కార్తీ చిదంబరం, సీతారాం తదితరులు ఉన్నారు. ఇక ఈ రోజు జరిగిన పార్లమెంట్ ఉభయసభల్లోనూ ఎన్‌కౌంటర్‌ అంశం మీదే పెద్ద చర్చ జరిగింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫేక్ ఎన్‌కౌంటర్ అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి చేసిన ట్వీట్‌ అందరిలో పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది.

ఈ ఎన్‌కౌంటర్‌పై ట్వీట్ చేసిన గుత్తా జ్వాల.. ‘‘దీని వలన భవిష్యత్‌లో అత్యాచారాలు ఆగుతాయా..? సామాజికపరంగా ఎదురయ్యే ప్రతిఘటనలు పట్టించుకోకుండా ప్రతి రేపిస్ట్‌కు ఇదే శిక్ష వేస్తారా..?’’ అంటూ ఆమె ప్రశ్నించింది. అయితే గుత్తా జ్వాల ఒక్కరే కాదు. చాలా మంది ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలనే సంధిస్తున్నారు. ఇటీవల కాలంలోనే తెలంగాణలో పలు అత్యాచార ఘటనలు జరిగాయి. హాజీపూర్‌లో ఓ సీరియల్ కిల్లర్.. ముగ్గురు మైనర్ బాలికలను అత్యాచారం చేసి దారుణంగా హత్య చేయగా.. హన్మకొండలో అమ్మ పక్కన పడుకున్న తొమ్మిది నెలల బాలికను ఎత్తుకెళ్లి హత్యాచారం చేశాడు ఓ సైకో. ఇవి రెండే కాదు దిశ హత్యాచారం జరిగిన రోజే.. వరంగల్‌లో మానస అనే మైనర్ యువతి హత్యాచారానికి గురైంది. అదే రోజు ఆమె పుట్టినరోజు కావడం అందరినీ బాధించిన అంశం. అయితే ఈ అన్ని కేసుల్లో నిందితుల తప్పు రుజువైనా.. ఎలాంటి చర్యలు లేవు. ఇక ఇప్పుడు వీరిని ఎన్‌కౌంటర్ చేయడంపై చాలా మంది గుత్తా జ్వాలా రేకెత్తించిన ప్రశ్నలనే సంధిస్తున్నారు.