Breaking News
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్ర నోడల్‌ ఆఫీసర్‌ రాంబాబు టీవీ9 గుడ్‌మార్నింగ్ ఇండియాలో చెప్పినట్టుగానే పాజిటివ్‌ కేసులు బాగా పెరుగుతున్నాయి.
  • ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో కోత పెట్టి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం కరెక్ట్‌ కాదంటున్నారు తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు. అధికారం ఉందని ఇష్ట ప్రకారం చేస్తామనడం సబబు కాదన్నారు.
  • కరోనా భూతాన్ని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది.. . ఇవాళ భేటి అయిన కేంద్ర కేబినెట్‌ ఇందుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా మహమ్మారిపై యుద్ధం చేయడానికి నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో పార్లమెంట్‌ సభ్యుల వేతనాల్లో 30 శాతం కోత విధించారు.. ఏడాది పాటు కోత ఉంటుంది.
  • కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కొన్నిచోట్ల ప్రభుత్వ ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తిరునాళ్లను తలపిస్తోంది.
  • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో అకాలవర్షం భయపెడుతోంది. కర్నూలు, మహబూబ్‌నగర్‌ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతాల్లో జోరుగా వానపడింది. ఇటు వికారాబాద్‌ జిల్లా పర్గితో పాటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోనూ వర్షం కురిసింది. వేసవి కాలంలో పడుతున్న ఈ అకాలవర్షంతో జనం బెంబేలెత్తారు.
  • కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లాలో కరోనా ల్యాబ్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. టెలీ మెడిసిన్‌ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ సడలింపు కేంద్రమే నిర్ణయించాలంటున్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.

సైనా పొలిటికల్ ఎంట్రీపై జ్వాల ట్వీట్.. నెటిజన్లు ఫైర్.!

Gutta Jwala Controversial Tweet, సైనా పొలిటికల్ ఎంట్రీపై జ్వాల ట్వీట్.. నెటిజన్లు ఫైర్.!

Gutta Jwala Controversial Tweet: ఇటీవల స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఎన్నో పతకాలు, ఆపై రికార్డులు సాధించిన సైనా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలోకి చేరడం పార్టీలో కొత్త జోష్‌ను నింపుతుందని నేతలు కూడా భావిస్తున్నారు.

అయితే సైనా పొలిటికల్ రీ-ఎంట్రీపై మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా మాత్రం తీవ్ర విమర్శలు గుప్పించింది. సైనాను కించపరిచే విధంగా ట్వీట్ చేసింది. ‘ఇప్పటివరకు అర్ధం పర్ధంలేని ఆటలే ఆడావ్ అని అనుకున్నా.. కానీ ఇప్పుడు అర్ధంపర్ధం లేని పార్టీలో కూడా జాయిన్ అయ్యావని’ గుత్తా జ్వాల ట్వీట్‌లో పేర్కొంది. ఇక ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే నెటిజన్లు మాత్రం గుత్తా ట్వీట్‌కు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. ‘ అర్థం లేని పెళ్లిళ్లు మాత్రం చేసుకోలేదులే’ అంటూ ఓ నెటిజన్ రిప్లై ఇవ్వగా.. ‘నీకు నచ్చిన పార్టీలో నువ్వు కూడా చేరొచ్చు.. ఎవరు ఆపారు’ అంటూ మరో నెటిజన్ ఘాటుగా స్పందించాడు.

Related Tags