హత్య కుట్రను ఛేదించిన పోలీసులు.. ఏడుగురి అరెస్ట్

గుంటూరు జిల్లాలో ఒకరి హత్య కుట్రను పోలీసులు ఛేదించారు. అరండల్ పేట పరిధిలో ప్రత్యర్దులను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన ఏడుగురు రౌడీ షీటర్లను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

హత్య కుట్రను ఛేదించిన పోలీసులు.. ఏడుగురి అరెస్ట్
Follow us

|

Updated on: Jul 03, 2020 | 6:42 PM

గుంటూరు జిల్లాలో ఒకరి హత్య కుట్రను పోలీసులు ఛేదించారు. అరండల్ పేట పరిధిలో ప్రత్యర్దులను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన ఏడుగురు రౌడీ షీటర్లను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరండల్ పేట ప్రాంతానికి చెందిన రమణ అనే వ్యక్తిని హత్య చేసేందుకు రౌడీ షీటర్ చెకోడీల సతీష్ పథకం పన్నాడు. కొద్ది రోజులుగా రౌడీ షీటర్లపై నిఘా పెట్టిన పోలీసులు, చాకచక్యంగా సతీష్ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకుని మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.

ఇదిలావుంటే, కొద్ది రోజుల క్రితం రౌడీ షీటర్ బసవల వాసు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసు సంబంధించి చెకోడీల సతీష్ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. అయితే, వాసు అనుచరుడు కాల్వ రమణ గ్యాంగ్ తమను హత్య చేస్తారనే భయంతో ముందస్తుగా రమణను హంతమార్చడానికి సిద్దమైంది చెకోడీల సతీష్ గ్యాంగ్. వాసు హత్య అనంతరం గుంటూరు పోలీసులు రౌడీ ఫీటర్ల కదలికలపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగానే రమణ హత్యకు సతీష్ గ్యాంగ్ ఫ్లాన్ చేస్తున్నట్లు పోలీసులు పసిగట్టారు. దీంతో చెకోడీల సతీష్ తోపాటు అతని అనుచరులు చింతం సతీష్, ముళ్ళపూడి రామ్ బ్రహ్మం, యార్లగడ్డ శివ కోటేశ్వరరావు, జొన్నకూటి సుకేష్, తోట వంశీ, యామిని దర్గాకృష్ణలను అరండల్ పోలీసులు అదుపులో తీసుకుని విచారించగా అసలు విషమం ఒప్పుకున్నారు. వీరి నుంచి ఎనిమిది వేట కొడవళ్ళు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. గుంటూరులోని రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టామని, రౌడీ షీటర్లు ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి హెచ్చరించారు. నగరంలోని రౌడీ షీటర్లు తమ ప్రవర్తన మిర్చుకోవాలని సూచించారు.