పోలీసుల కీల‌క నిర్ణ‌యం..బయటకొస్తే.. క్వారంటైన్‌కే..!

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను మ‌రింత స్ట్రిక్ట్ గా అమ‌లుచేస్తున్నారు పోలీసులు. హాట్‌స్పాట్‌లుగా ఇప్పటికే అనౌన్స్ చేసిన‌ గుంటూరు, నరసరావుపేటలో ప్రజలెవరూ బయటకు రాకుండా మరిన్ని కఠిన ఆంక్షలు విధించారు. ఎమ‌ర్జెన్సీ కాకుండా సాధార‌ణ ప‌నుల‌కు బ‌య‌ట‌కు వచ్చేవారిని క్వారంటైన్ సెంట‌ర్స్ కు తరలిస్తున్నారు. మరోవైపు, గుంటూరు జిల్లాలో క‌రోనా టెర్ర‌ర్ క్రియేట్ చేస్తోంది. సోమవారం కొత్తగా మరో 23 కేసులు నమోదైనట్లు ప్ర‌భుత్వం తాజా బులెటెన్ లో పేర్కొంది. దీంతో […]

పోలీసుల కీల‌క నిర్ణ‌యం..బయటకొస్తే.. క్వారంటైన్‌కే..!
Follow us

|

Updated on: Apr 27, 2020 | 1:32 PM

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను మ‌రింత స్ట్రిక్ట్ గా అమ‌లుచేస్తున్నారు పోలీసులు. హాట్‌స్పాట్‌లుగా ఇప్పటికే అనౌన్స్ చేసిన‌ గుంటూరు, నరసరావుపేటలో ప్రజలెవరూ బయటకు రాకుండా మరిన్ని కఠిన ఆంక్షలు విధించారు. ఎమ‌ర్జెన్సీ కాకుండా సాధార‌ణ ప‌నుల‌కు బ‌య‌ట‌కు వచ్చేవారిని క్వారంటైన్ సెంట‌ర్స్ కు తరలిస్తున్నారు.

మరోవైపు, గుంటూరు జిల్లాలో క‌రోనా టెర్ర‌ర్ క్రియేట్ చేస్తోంది. సోమవారం కొత్తగా మరో 23 కేసులు నమోదైనట్లు ప్ర‌భుత్వం తాజా బులెటెన్ లో పేర్కొంది. దీంతో జిల్లా వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 237కు చేరింది. వీటిలో అత్యధికంగా గుంటూరు సిటీలో 134 కేసులు నమోదు కాగా.. నరసరావుపేటలో 64 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. జిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కు ఈ డేంజ‌ర‌స్ వైర‌స్ నుంచి 29మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. ఎనిమిది మంది చ‌నిపోయారు.