ఆశావర్కర్‌ విజయలక్ష్మి డెత్ మిస్టరీ : వ్యాక్సినేషనే కారణమంటోన్న ఫ్యామిలీ, బ్రెయిన్ స్ట్రోక్ వల్లేనని చెబుతోన్న వైద్యులు

గుంటూరు జీజీహెచ్‌లో ఆశావర్కర్‌ విజయలక్ష్మి మృతి వివాదాస్పదంగా మారుతోంది. పెనుమాక ఆశావర్కర్‌గా పనిచేస్తున్న ఆమె..ఈ నెల 20న కొవిడ్‌ వ్యాక్సిన్...

ఆశావర్కర్‌ విజయలక్ష్మి డెత్ మిస్టరీ : వ్యాక్సినేషనే కారణమంటోన్న ఫ్యామిలీ, బ్రెయిన్ స్ట్రోక్ వల్లేనని చెబుతోన్న వైద్యులు
Follow us

|

Updated on: Jan 24, 2021 | 12:56 PM

గుంటూరు జీజీహెచ్‌లో ఆశావర్కర్‌ విజయలక్ష్మి మృతి వివాదాస్పదంగా మారుతోంది. పెనుమాక ఆశావర్కర్‌గా పనిచేస్తున్న ఆమె..ఈ నెల 20న కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. తర్వాత రెండ్రోజులకు అస్వస్థతకు గురైన విజయలక్ష్మిని గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో జాయిన్‌ చేశారు. అప్పటినుంచి చికిత్స తీసుకుంటున్న ఆమె.. ఆదివారం చనిపోయారు. ఐతే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వల్లే విజయలక్ష్మి చనిపోయిందని వెల్లడించారు డీఎంహెచ్‌వో యాస్మిన్‌. ఈ నెల 20న తాడేపల్లి ఆరోగ్య కేంద్రంలో విజయలక్ష్మి.. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారని..ఆమెతో పాటు వైద్యాధికారి సహా 10 మంది టీకా వేయించుకున్నట్లు తెలిపారు యాస్మిన్‌. మిగతా ఎవరికీ ఎలాంటి ఇబ్బదులు లేవన్నారు. విజయలక్ష్మికి మాత్రమే తలనొప్పి, మగత, వాంటింగ్స్‌ లక్షణాలతో స్పృహ కోల్పోవడంతో 22న గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారని అంటున్నారు. ఐతే ఆమె బ్రెయిన్‌ స్ట్రోక్‌తోనే చనిపోయిందని నిర్థారించినట్లు తెలిపారు. అలాగే గొట్టెముక్కల లక్ష్మి అనే మహిళ కూడా తలనొప్పి, ఫిట్స్‌తో 23న హాస్పిటల్‌లో చేరారని.. టెన్షన్‌ వల్లే అలా జరిగిందని వెల్లడించారు. ఆమె కోలుకున్నారని.. త్వరలోనే డిశ్చార్జ్‌ చేస్తామని తెలిపారు. ఇక ఆమెతో పాటు టీకా వేయించుకున్న 10 మంది సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు యాస్మిన్‌. ఐతే విజయలక్ష్మి బంధువులు మాత్రం కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత.. అస్వస్థతకు గురై విజయలక్ష్మి మృతి చెందిందని అంటున్నారు. దీంతో కొంచెం సేపటిక్రితం జీజీహెచ్‌కు చేరుకున్నారు కలెక్టర్‌, డీఎంహెచ్‌వో విజయలక్ష్మి. మృతురాలి బంధువులతో మాట్లాడారు.