చేప కడుపులోనూ ప్లాస్టిక్.. వీడియో వైరల్

ప్లాస్టిక్ కాలుష్యం జలచరాల ప్రాణాలనూ  తీస్తోంది. స్పెయిన్ లోని క్యానరీ దీవుల్లో ఓ మత్స్య కారుడి గాలంలో చిక్కుకున్న ఓ చేపను బయటకు తీసి చూస్తే.. అది ఎందుకో అతనికి అసాధారణ రీతిలో కనిపించిందట.. వెంటనే దాని కడుపుచీల్చి చూస్తే ప్లాస్టిక్ ముక్కలు కనిపించాయి. ఆశ్చర్యపోయిన ఈ మత్స్య కారుడు తన స్నేహితుల చెవిన వేశాడు. అది అలా.. యాస్మిన్ స్కాట్ అనే ట్విటర్ యూజర్ కు తెలియగానే .. ఈ వింతకు సంబంధించిన వీడియోను పోస్ట్ […]

చేప కడుపులోనూ ప్లాస్టిక్.. వీడియో వైరల్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 25, 2020 | 6:34 PM

ప్లాస్టిక్ కాలుష్యం జలచరాల ప్రాణాలనూ  తీస్తోంది. స్పెయిన్ లోని క్యానరీ దీవుల్లో ఓ మత్స్య కారుడి గాలంలో చిక్కుకున్న ఓ చేపను బయటకు తీసి చూస్తే.. అది ఎందుకో అతనికి అసాధారణ రీతిలో కనిపించిందట.. వెంటనే దాని కడుపుచీల్చి చూస్తే ప్లాస్టిక్ ముక్కలు కనిపించాయి. ఆశ్చర్యపోయిన ఈ మత్స్య కారుడు తన స్నేహితుల చెవిన వేశాడు. అది అలా.. యాస్మిన్ స్కాట్ అనే ట్విటర్ యూజర్ కు తెలియగానే .. ఈ వింతకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఒక నిముషం 40 సెకండ్ల పాటు నిడివి ఉన్న ఈ వీడియో వైరల్ అవుతోంది. ఒక చిన్న చేపలోనే ప్లాస్టిక్ ముక్కలుంటే ఇక చాలావరకు  భారీ షార్క్ చేపలు,  తిమింగలాలు స్వాహా చేస్తే వాటి కడుపులో ఎంత మేరకు ప్లాస్టిక్ ఉంటుందో వేరే చెప్పాలా అంటున్నారు..