Breaking News
  • కర్నూలు: ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్వాకం. మహిళకు ఆపరేషన్‌ చేసి కడుపులో దూదిని మర్చిపోయిన డాక్టర్లు. డాక్టర్ల తీరుపై బాధిత బంధువుల ఆందోళన.
  • హైదరాబాద్‌: ఇందిరాపార్క్‌ దగ్గర ఎమ్మార్పీఎస్‌ మహాదీక్ష. ఎమ్మార్పీఎస్‌ మహాదీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ. నాచారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మందకృష్ణ అరెస్ట్‌. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా దీక్షకు పిలుపునిచ్చిన ఎమ్మార్పీఎస్‌.
  • వనపర్తి: పెబ్బేరు బైపాస్‌లో ఆటోను ఢీకొన్న కారు. ఒకరు మృతి, మరో ముగ్గురికి గాయాలు. ఒకరి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • తూ.గో: కాకినాడలో అధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష. విషజ్వరాలు అధికంగా ఉన్న చోట స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలి. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు చేపట్టాలి. ప్రైమరీ స్కూళ్లలో టీచర్ల కొరతను త్వరలో పరిష్కరిస్తాం. తూ.గో.జిల్లాలో రూ.250 కోట్లతో మంచినీటి పథకం అమలుచేస్తాం. అర్హులందరికీ త్వరలో ఇళ్ల స్థలాల పట్టాలు అందిస్తాం-మంత్రి కన్నబాబు.
  • హైదరాబాద్‌: ఇందిరాపార్క్‌ దగ్గర ఎమ్మార్పీఎస్‌ మహాదీక్ష. ఎమ్మార్పీఎస్‌ మహాదీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ. నాచారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మందకృష్ణ అరెస్ట్‌. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా దీక్షకు పిలుపునిచ్చిన ఎమ్మార్పీఎస్‌.
  • కరీంనగర్‌: కలెక్టర్‌ ఆడియో టేపుల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌. వివరాలు సేకరిస్తున్న సీఎంఓ అధికారులు. ఇప్పటికే ప్రభుత్వానికి వివరణ ఇచ్చిన కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌.
  • ఉత్తరాఖండ్: సాయంత్రం బద్రీనాథ్‌ ఆలయం మూసివేత. చివరిరోజు కావడంతో భారీగా దర్శించుకుంటున్న భక్తులు.

నమ్మక ద్రోహం.. దుబాయ్‌లో వ్యభిచార గృహానికి అమ్మేసిన దుర్మార్గులు

Gulf victims complaint on fake agents

పేదరికం వారికి శాపమైంది. ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడటం మోసగాళ్లకు వరంగా మారింది. మాయమాటలు చెప్పి దుబాయ్‌లో మంచి ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించి ఏకంగా వ్యభిచార గృహాలకు అమ్మేసిన దుర్మార్గుల దురాగతాలు మరోసారి వెలుగుచూశాయి.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలకు దుబాయ్‌లో ఉద్యోగాలు ఉన్నాయని, అక్కడ పనిచేస్తే దాదాపు రూ. 30 వేల జీతం వస్తుందని ఆశపెట్టి తీసుకెళ్లారు. విజిటింగ్ వీసాలపై దుబాయ్ తీసుకెళ్లి వ్యభిచారం చేయాలని బలవంతం చేశారు. ఎంతో నమ్మకంతో దుబాయ్ చేరుకున్న వీరికి అక్కడ ప్రత్యక్ష నరకం కనిపించడంతో ఖంగుతిన్నారు.

వ్యభిచారం చేయాలని తమను బలవంతం చేయడంతో తిరస్కరించిన వీరిని శారీరకంగా చిత్రవధ చేశారు. తెలుగు వారై ఉండి కూడా దుబాయ్‌ దేశంలో వీరికి  ఎన్నో కష్టాలకు గురిచేశారు.   దుబాయ్‌లో భాధలను అనుభవించడం కంటే ఇంటికి వెళ్లిపోవడం మంచిదని ఆలోచించి తెగించి వెనక్కి వచ్చేశారు. వచ్చీ రాగానే వీరు దుబాయ్‌లో ఎదుర్కొన్న దారుణ పరిస్థితులపై నరసాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నరసాపురంలో ప్రాంతంలో పలువురు యువతులకు గాలం వేసి గల్ఫ్ దేశాలకు పంపించే నకిలీ ఏజెంట్ చినబాబు, జ్యోతి అనే ఇద్దరు తమను నమ్మించి దుబాయ్‌కి  పంపించారని ఆ మహిళలు చెప్పారు. దీంతో చినబాబు,జ్యోతిలపై పోలీసులు కేసు నమోదు చేశారు . అయితే మోసానికి పాల్పడిన చినబాబు, జ్యోతి అనే ఇద్దరూ ప్రస్తుతం పరారీలో ఉండటంతో వారిని వెదికే పనిలో ఉన్నారు పోలీసులు.