గుజరాత్ సర్కార్ కీలక నిర్ణయం… విద్యార్థులు లేక మూతపడుతున్న పాఠశాలలు.. కచ్ జిల్లాలో 179 స్కూళ్లు క్లోజ్.. !

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ స్కూళ్లను ప్రారంభిస్తున్నారు. కరోనా కేసులు నమోదవుతున్నా.. చిన్న చిన్న లోపాలను అధిగమిస్తూ స్కూళ్లను తెరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

గుజరాత్ సర్కార్ కీలక నిర్ణయం... విద్యార్థులు లేక మూతపడుతున్న పాఠశాలలు.. కచ్ జిల్లాలో 179 స్కూళ్లు క్లోజ్.. !
Follow us

|

Updated on: Nov 25, 2020 | 1:04 PM

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ స్కూళ్లను ప్రారంభిస్తున్నారు. కరోనా కేసులు నమోదవుతున్నా.. చిన్న చిన్న లోపాలను అధిగమిస్తూ స్కూళ్లను తెరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, కరోనా వైరస్ మరోసారి తీవ్రస్థాయిలో విజృంభిస్తుండటంతో విద్యార్థులు లేక గుజరాత్ లోని చాలా స్కూళ్లను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

గుజరాత్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కొన్ని విద్యార్థులు లేక మూతబడుతూనే ఉన్నాయి. అందులో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఉపాధ్యాయులున్న చోట విద్యార్థులు లేకపోవడం, విద్యార్థులు దండిగా ఉన్న చోట ఉపాధ్యాయుల కొరత నెలకొనడం లాంటి సమస్యల నేపధ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూసివేతకు గురైన పాఠశాలల విద్యార్థులను సమీపంలోని మరో బడికి మార్చారు. ఉపాధ్యాయులను సమీపంలోని పాఠశాలలకు కేటాయించారు.

ఇందులో భాగంగా కచ్ జిల్లాలోని 179 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులను ఇతర పాఠశాలలకు తరలించాలని అధికారలు నిర్ణయించారు. ఒక్కో పాఠశాలలో 20 మంది విద్యార్థుల కంటే తక్కువ మంది విద్యార్థులతో ఉన్న హైస్కూళ్లను మూసివేయాలని గుజరాత్ విద్యా శాఖ అధికారులు ఆదేశించారు. అయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ఇతర పాఠశాలలకు మార్చాలని విద్యా శాఖ ఆదేశించింది.

ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 179 పాఠశాలలను గుర్తించామని, అక్కడ ఉన్నత ప్రాధమిక విభాగాలు మూసివేయాల్సి వస్తుందని కచ్ జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారి జె.పి.ప్రజపతి తెలిపారు. విద్యార్థులను సమీపంలోని ఇతర ప్రభుత్వ పాఠశాలలకు మారుస్తున్నామన్నారు. ఈ ప్రక్రియను నవంబర్ 3 నుండి ప్రారంభించి నవంబర్ 30 లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ సర్క్యులర్ మాకు అందింది. దీని ప్రకారం, ఈ ప్రక్రియను పూర్తి చేయాలని మేము సంబంధిత ఉన్నత పాఠశాలల ముఖ్యా శిష్కాస్ (ప్రధాన ఉపాధ్యాయులు) కు సూచించామని విద్యాశాఖాధికారి జె.పి.ప్రజపతి చెప్పారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!