గుజరాత్‌ సముద్ర తీరంలో పాక్‌ పడవలు

Gujarat: BSF seizes 2 Pakistani boats abandoned in Harami Nala, గుజరాత్‌ సముద్ర తీరంలో పాక్‌ పడవలు

భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులోని సముద్ర జలాల్లో పాక్‌ పడవులు కన్పించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. గుజరాత్‌లోని కచ్‌ జిల్లాకు సమీపంలో గల ‘హరామి నాలా’ ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన రెండు మత్స్యకారుల పడవలను సరిహద్దు భద్రతాసిబ్బంది శనివారం గుర్తించారు.

కశ్మీర్‌ అంశం నేపథ్యంలో భారత్, పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మన దేశానికి ఉగ్ర ముప్పు ఉందని గత కొంతకాలంగా నిఘా వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే శ్రీలంక మీదుగా కొందరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో గుజరాత్‌ తీరంలో పాక్‌ పడవలు కన్పించడంతో భద్రతాసిబ్బంది అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతాల గుండా ముష్కరులు దేశంలోకి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆ పడవలను సునిశితంగా తనిఖీ చేశారు. అయితే అందులో అనుమానించదగ్గ వస్తువులేవీ కన్పించలేదని అధికారులు తెలిపారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *